ఈ ఏడాదే జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు!

author img

By

Published : Jun 17, 2022, 6:23 PM IST

Updated : Jun 17, 2022, 9:01 PM IST

J-K assembly elections

జమ్ముకశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు రక్షణమంత్రి రాజ్​నాథ్​. కుదిరితే ఈ ఏడాది చివర్లోనే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన కసరత్తు ఇటీవలే ముగిసిందని చెప్పారు.

రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్ముకశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల నిర్వహణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సంకేతాలు ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్న రాజ్‌నాథ్‌.. అక్కడ ఈ ఏడాది లోపు శాసనసభ ఎన్నికలు జరగవచ్చని తెలిపారు. అక్కడ ఇటీవలే నియోజకవర్గాల పునర్​విభజన ప్రక్రియ పూర్తైందని గుర్తు చేశారు. సీట్ల సంఖ్య కశ్మీర్‌ ప్రాంతంలో 47, జమ్మూలో 43కు పెరిగిందని తెలిపారు.
జమ్ముకశ్మీర్‌లో 2018 జూన్‌ నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన ఆర్టికల్‌ 370ని కేంద్రం 2019లో రద్దు చేసింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌ను రెండు వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: సంపదలో భాజపానే టాప్​.. తరువాతి స్థానాల్లో ఎవరంటే?

Last Updated :Jun 17, 2022, 9:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.