ETV Bharat / bharat

తీస్తా సీతల్వాడ్​ బెయిల్​పై హైడ్రామా.. లొంగిపోవాలన్న గుజరాత్‌ హైకోర్టు.. తీర్పుపై సుప్రీం స్టే

author img

By

Published : Jul 2, 2023, 8:41 AM IST

Updated : Jul 2, 2023, 9:25 AM IST

teesta-setalvad-news-gujarat-high-court-denies-teesta-setalvad-bail-upreme-court-bench-gives-relief
తీస్తా సీతల్వాడ్​

Teesta Setalvad : ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ బెయిల్‌పై.. శనివారం నాటకీయ పరిణామాలు జరిగాయి. తీస్తా వేసిన సాధారణ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించిన గుజరాత్‌ హైకోర్టు.. తక్షణమే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. వెంటనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించింది.

Teesta Setalvad Supreme Court : ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ బెయిల్‌పై.. శనివారం నాటకీయ పరిణామాలు జరిగాయి. తీస్తా వేసిన సాధారణ బెయిల్‌ దరఖాస్తును తిరస్కరించిన గుజరాత్‌ హైకోర్టు.. తక్షణమే లొంగిపోవాలని ఆమెను ఆదేశించింది. వెంటనే ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఉపశమనం లభించింది. గుజరాత్‌లో 2002లో.. జరిగిన అల్లర్ల విషయంలో ప్రత్యేక దర్యాప్తు బృందానికి, పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై తీస్తా సీతల్వాడ్‌పై గతంలో కేసు నమోదైంది. ఆ కేసులో గుజరాత్‌ యాంటీ టెర్రర్‌ స్క్వాడ్‌ తీస్తాను అదుపులోకి తీసుకోగా.. రెండు నెలల పాటు ఆమె జైల్లో ఉన్నారు. తనకు బెయిల్ నిరాకరిస్తూ సెషన్స్ కోర్టు, హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ.. తీస్తా సీతల్వాడ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై గత సెప్టెంబర్‌లో తీస్తా సీతల్వాడ్‌కు ఊరట లభించింది. అప్పటి నుంచి మధ్యంతర బెయిల్‌పై ఆమె బయట ఉన్నారు.

సాధారణ బెయిల్‌ కోసం తాజాగా గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. తీస్తా అభ్యర్థనను గుజరాత్ హైకోర్టు తిరస్కరించింది. తక్షణమే లొంగిపోవాలని ఆదేశించింది. గుజరాత్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. ఇద్దరు న్యాయమూర్తులు ఉన్న వెకేషన్‌ బెంచ్‌లో ఆమెకు బెయిల్‌పై ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో CJI ఆదేశాలతో త్రిసభ్య ధర్మాసనం రాత్రి 9 గంటల 15 నిమిషాలకు విచారణ జరిపింది. గుజరాత్ హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేసేందుకు కనీసం సమయం ఇవ్వకపోవడాన్ని జస్టిస్‌ BR గవాయ్‌, జస్టిజ్‌ AS బోపన్న, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తప్పుబట్టింది. ఆమెను వెంటనే అరెస్ట్‌ చేయకపోతే ఆకాశం ఊడిపడుతుందా అని.. గుజరాత్ ప్రభుత్వం తరపున హాజరైన తుషార్ మెహతాను కోర్టు ప్రశ్నించింది. సాధారణ మనుషులు, సాధారణ నేరస్థులు చట్టం ముందు సమానమేనని మెహతా వాదించారు. ఆయన వాదనలు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై ఏడు రోజులు స్టే విధించింది. కాాగా 2002 గుజరాత్ అల్లర్ల కేసులో అమాయకులను ఇరికించేందుకు తప్పుడు ఆధారాలను రూపొందించారన్న ఆరోపణలపై జూన్ 25న తీస్తా సెతల్వాడ్​ అరెస్టయ్యారు.

Last Updated :Jul 2, 2023, 9:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.