ETV Bharat / bharat

రాత్రి, పగలు అనే తేడా లేదు.. వానలో తడుస్తున్నా పట్టింపు లేదు!

author img

By

Published : Jul 14, 2021, 7:42 PM IST

ఆ రాష్ట్రాన్ని టీకా కొరత తీవ్రంగా వేధిస్తోంది. వ్యాక్సిన్ల కోసం వర్షాలను లెక్కచేయక, అర్ధరాత్రి నుంచే టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ప్రజలు. అయితే.. తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేక.. అందరికీ పంపిణీ చేయలేక అధికారులు చేతులెత్తేస్తున్న పరిస్థితి. అధికారులతో వాగ్వాదాలు, టీకా కేంద్రాల వద్ద నిరసనలు నిత్యకృత్యం అయ్యాయి.

vaccine
టీకా కొరత

తమిళనాడు ప్రజల్ని వేధిస్తున్న టీకా కొరత

తమిళనాడు కోయంబత్తూరును కరోనా వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. అర్ధరాత్రి నుంచే టీకా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు ప్రజలు. అయితే.. టీకాలు అందుబాటులో లేవనే సమాధానంతో నిరసనలకు పాల్పడుతూ.. అధికారులతో వాదనకు దిగుతున్నారు. టీకాలు అందించేందుకు టోకెన్లను పంచకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

tamilnadu coimbatore
టీకాల కోసం ఎదురుచూస్తున్న మహిళలు

దాదాపు పది రోజుల తరువాత కోయంబత్తూర్​లో కొవిడ్ టీకాల పంపిణీ తిరిగి ప్రారంభమైంది. మొత్తం 31 కేంద్రాల్లో పంపిణీకి ఏర్పాట్లు చేశారు. దాదాపు 25 వేల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయన్న సమాచారంతో అర్ధరాత్రి నుంచే ప్రజలు ఆయా టీకా కేంద్రాల వద్ద భారీ క్యూలలో వేచి ఉన్నారు.

tamilnadu coimbatore
అర్ధరాత్రి రోడ్డుపైనే పడిగాపులు

అదుపుతప్పిన పరిస్థితి..

  • వడ మధురై టీకా కేంద్రం వద్ద గుమిగూడిన ప్రజలు.. ఎంతసేపటికీ టోకెన్లు జారీచేయకపోవడాన్ని తప్పుబట్టారు. ఆరోగ్య సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
  • పీలామెడు మున్సిపల్ పాఠశాల వద్ద టోకెన్ల కోసం ఎదురుచూసి విసుగు చెందిన ప్రజలు టీకా కేంద్రం ముందు రోడ్డు దిగ్బంధించారు. రాజకీయ పార్టీలే టీకాలన్నీ తరలించుకుపోయాయని ఆరోపించారు. ప్రజలు ఆసక్తి చూపినప్పుడే టీకాలు పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు.
  • నాంచందపురంలో ప్రజలు అర్ధరాత్రి నుంచే లైన్లలో వేచి ఉన్నారు. వర్షం పడుతున్నప్పటికీ.. గొడుగులు వేసుకొని మరీ వేచి ఉండటం గమనార్హం.
  • నాదూర్​లోని టీకా కేంద్రం వద్ద రాత్రి 8 గంటల నుంచి వేచి ఉన్న వారికి టోకెన్లు అందలేదు. ఈ కేంద్రంలో రోజుకు 300 మందికి మాత్రమే టోకెన్లు జారీ చేస్తున్నారు. దీనితో విసుగు చెందిన ప్రజలు.. మరుసటి రోజు టోకెన్లయినా ఇవ్వాల్సిందిగా పట్టుబట్టారు. కానీ అది కుదరదని అధికారులు తేల్చిచెప్పారు.
    tamilnadu coimbatore
    రాత్రి సమయాల్లోనూ నిల్చొనే ఉన్న ప్రజలు
    tamilnadu coimbatore
    వర్షంలోనూ బారులు తీరిన ప్రజలు

కోయంబత్తూరులో ఇప్పటివరకు 9 లక్షల 72 వేల మందికి టీకాలు అందించారు. టీకాలు తీసుకుంటేనే ఉద్యోగులను అనుమతిస్తున్నాయి పలు ప్రైవేటు కంపెనీలు. దీనితో యువత ఎక్కువగా టీకాల పట్ల ఆసక్తి చూపిస్తోంది.

మరోవైపు ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండేలా చూడాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీకా కేంద్రాల్లో రద్దీ వల్ల కరోనా వ్యాప్తి చెందుతుందని.. రేషన్ కార్డుల ఆధారంగా ఇంటివద్దే టీకా పంపిణీ చేయాలని సూచించారు.

tamilnadu coimbatore
టీకాల కోసం ఆందోళన

జిల్లాలో వ్యాక్సిన్ కొరత గురించి ఈటీవీ భారత్ రిపోర్టర్ జిల్లా కలెక్టర్​ను సంప్రదించగా ఆయన స్పందించలేదు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.