ETV Bharat / bharat

ఏడు ట్రక్కులకు నిప్పు- ఐదుగురు సజీవదహనం

author img

By

Published : Aug 27, 2021, 11:10 AM IST

Updated : Aug 27, 2021, 12:33 PM IST

అసోంలో గుర్తుతెలియని కొందరు దుండగులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఏడు బొగ్గు ట్రక్కులకు నిప్పంటించారు. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు.

suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
ఏడు ట్రక్కులకు నిప్పు- ఐదుగురు సజీవదహనం

ట్రక్కులకు నిప్పు

అసోం డిమా హాసాఓ జిల్లా డియుంగ్ ముఖ్​లో బొగ్గు లోడుతో ఉన్న ఏడు ట్రక్కులకు నిప్పంటించారు కొందరు దుండగులు. గురువారం రాత్రి జరిగిన ఈ ఘటనలో ఐదుగురు సజీవదనమయ్యారు. ట్రక్కులన్నీ కాలి బూడిదయ్యాయి. డీఎన్​ఎల్​ఏ ఉగ్రసంస్థకు చెందిన సభ్యులే ఈ దుశ్యర్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
తగలబడుతున్న ట్రక్కులు
suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
మంటల్లో కాలిపోతున్న ట్రక్కులు

రెేంజర్​బిల్​ ప్రాంతంలో ఆగంతుకులు తొలుత ట్రక్కులపై కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అనంతరం వాటిపై పెట్రోల్​ పోసి నిప్పంటించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చనిపోయిన ఐదుగురు ట్రక్కు డ్రైవర్లు ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కులలో మొత్తం 10 మంది ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
కాలిపోయిన ట్రక్కులు
suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
కాలిపోయిన ట్రక్కులు

అసోంలో డిమాసా నేషనల్ లిబరేషన్ ఆర్మీ (డీఎన్​ఎల్​ఏ) ఉగ్ర సంస్థ మళ్లీ క్రియాశీలకంగా మారింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున డిమా హాసాఓ జిల్లాలోని మైబాంగ్​లో కాల్పులకు తెగబడింది. కొంత మంది గ్రామస్థులు భద్రతా దళాలకు తమ గురించి సమాచారం అందిస్తున్నందు వల్లే కాల్పులు జరిపినట్లు తెలిపింది. ఆ తర్వాత ఆగస్టు 18, 19 తేదీల్లో మైబాంగ్​ దావ్​తుహజ రైల్వే స్టేషన్లోనూ కాల్పులు జరిపింది.

suspected militant outfit DNLA set fire to Coal loaded trucks
కాలిబూడిదైన ట్రక్కులు

ఇదీ చూడండి: Farmers Protest: 'దేశవ్యాప్త ఉద్యమంగా రైతుల ఆందోళన'

Last Updated :Aug 27, 2021, 12:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.