ETV Bharat / bharat

'దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు'

author img

By

Published : Sep 15, 2021, 7:08 AM IST

Updated : Sep 15, 2021, 7:13 AM IST

దంపతులిద్దరూ విషం తాగినప్పుడు.. ఆత్మహత్యకు ప్రేరేపించాడని భర్తకు శిక్ష విధించడం సరికాదని సుప్రీంకోర్టు (Supreme Court) స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రయల్ కోర్టు, హైకోర్టులు ఇచ్చిన తీర్పులను తోసిపుచ్చింది.

supreme court
'దంపతులిద్దరూ విషం తాగితే భర్తను శిక్షించడం తగదు'

దంపతులిద్దరూ విషం తాగిన సందర్భంలో (Drinking Poison) ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ భర్తకు శిక్ష విధించడం సరికాదని మంగళవారం సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు చెప్పింది. ఆత్మహత్య చేసుకోవడం మినహా గత్యంతరం లేని పరిస్థితులు కల్పించినప్పుడే.. ప్రేరేపించారని భావించి శిక్ష వేయాల్సి ఉంటుందని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.

కేసు పూర్వాపరాలను పరిశీలిస్తే తమిళనాడుకు (Tamil nadu) చెందిన వేలుదురైకు వివాహం జరిగి 25 ఏళ్లు కాగా, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య గొడవ జరగగా, అనంతరం ఇద్దరూ పురుగుమందు తాగారు. ఆమె చనిపోగా, ఆయన బతికాడు. దాంతో ఆత్మహత్యకు ప్రేరేపించాడంటూ ఆయనకు సెక్షన్‌ 306 కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు కూడా ఇందుకు ఆమోదించింది.

అయితే, ఈ తీర్పుతో సుప్రీంకోర్టు (Supreme Court) మాత్రం ఏకీభవించలేదు. ఇద్దరూ ఆత్మహత్యయత్నం (Couple Suicide) చేశారని, అందువల్ల భర్త ఆత్మహత్యకు ప్రేరేపించినట్టుగా భావించలేమని తెలిపింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ తప్ప, ఇతరత్రా సంఘటనలు జరిగినట్టు నిరూపించలేదని పేర్కొంది.

ఇదీ చదవండి: ఒకప్పుడు ఖైదీలు.. ఇప్పుడదే జైలుకు బాస్​లు

Last Updated :Sep 15, 2021, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.