ETV Bharat / bharat

'ఓబీసీ స్థానాలను జనరల్​ సీట్లుగా మార్చండి'

author img

By

Published : Dec 16, 2021, 7:20 AM IST

OBC Reservation in Maharashtra: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓబీసీకి కేటాయించిన సీట్లను జనరల్​ స్థానాలగా మార్చాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే పోలింగ్​ వాయిదా విజ్ఞప్తి తిరస్కరించింది ధర్మాసనం.

OBC Reservation in Maharashtra
OBC Reservation in Maharashtra

OBC Reservation in Maharashtra: మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీలకు కేటాయించిన 27 శాతం సీట్లను జనరల్​ స్థానాలుగా పరిగణించాలని సుప్రీంకోర్టు బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు జస్టిస్​ ఏఎం ఖాన్విల్కర్​, జస్టిస్​ సీటీ రవికుమార్​లతో కూడిన ధర్మాసనం తెలిపింది.

ఇతర సీట్లకు ఎన్నికలు నిర్వహించి, ఓబీసీలకు రిజర్వు చేసిన స్థానాలకు మాత్రం జరపకూడదంటూ ఈ నెల 6న సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది. దీన్ని మార్చాలని మహారాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా.. ఓబీసీ స్థానాలను జనరల్​ స్థానాలుగా పరిగణించాలని ఆదేశించింది. వీటి ఎన్నికల నిర్వహణకు వారం రోజుల్లోగా తాజా నోటిఫికేషన్​ ఇవ్వాలని సూచించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు వెనుకబాటుతనాన్ని గుర్తించి, అందుకు అనుగుణంగా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే వరకు ఇదే విధానం కొనసాగుతుందని తెలిపింది. ఎన్నికలను వాయిదా వేయాలన్న విజ్ఞప్తిని మాత్రం తిరస్కరించింది.

ఇదీ చూడండి: Bipolar man as Judge: దిల్లీలో జిల్లా కోర్టు జడ్జిగా 'బైపోలార్‌ మ్యాన్‌'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.