ETV Bharat / bharat

'రూ.500 కోట్ల పార్టీ ఫండ్ కోసం కేజ్రీవాల్ ఒత్తిడి'.. మరో బాంబు పేల్చిన సుకేశ్

author img

By

Published : Nov 5, 2022, 6:50 PM IST

ఆర్థిక నేరగాడు సుఖేశ్​​ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశాడు. ఇటీవల దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్​కు లేఖ రాసి ఆప్​ నేత సత్యేంద్ర జైన్​పై తీవ్ర ఆరోపణలు చేసిన సుకేశ్.. తాజా లేఖలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ను టార్గెట్ చేశాడు.

sukesh kejriwal issue
సుఖేశ్​​ చంద్రశేఖర్

ఆర్థిక నేరగాడు, రూ.200 కోట్ల మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేశ్ చంద్రశేఖర్.. మరోసారి ఆమ్ ఆద్మీ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. పార్టీ ఫండ్ కోసం రూ.500 కోట్లు సమకూర్చాలని దిల్లీ సీఎం కేజ్రీవాల్ 2016లో తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఆరోపించాడు. ఇందుకు ప్రతిఫలంగా కర్ణాటక పార్టీలో కీలక స్థానం ఆఫర్ చేశారని తెలిపాడు. తనకు రాజ్యసభ సీటు ఆశచూపి కేజ్రీవాల్ రూ.50 కోట్లు తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు దిల్లీ దిల్లీ లెప్టినెంట్​ గవర్నర్​కు సుకేశ్​ మరో లేఖ రాశాడు.

Sukesh Chandrashekhar
సుకేశ్ రాసిన లేఖ

"2016లో కైలాశ్​ గహ్లోత్ ఫామ్​ హౌస్​లో మీకు నేనూ రూ.50 కోట్లు ఇచ్చాను. అప్పుడు హైదరాబాద్ హయత్ హోటల్​లో జరిగిన నా డిన్నర్​ పార్టీకి సంత్యేంద్ర జైన్​తో హాజరయ్యారు. నేను దేశంలోనే పెద్ద దొంగనైతే నా పార్టీకి మీరెందుకు వచ్చారు? 2017లో నేను తిహాడ్​ జైలులో ఉన్నప్పుడు సంత్యేంద్ర జైన్ నన్ను చూడటానికి వచ్చినప్పుడు మీరు నాతో ఫోన్‌లో ఎందుకు మాట్లాడారు? పార్టీ ఫండ్ కోసం 30-40 మంది నుంచి రూ.500 కోట్లు సేకరించాలని 2016లో నాపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు?" అని సుకేశ్​ కేజ్రీవాల్​ని ప్రశ్నించాడు.

"తమిళనాడులోని కొంతమంది ఎమ్మెల్యేలు, నటీనటులను ఆప్‌లో చేరేలా నా ద్వారా ఒప్పించాలని జైన్‌కు ఎందుకు చెబుతూ వచ్చారు? ఈ విషయంపై 2016, 2017లో నాపై ఒత్తిడి ఎందుకు తెచ్చారు? 2019లో జైలులో నాకు రక్షణ కోసం జైన్‌కు మరో రూ.10 కోట్లు ఇచ్చినప్పుడు మీరు సరే అని ఎలా అన్నారు" అని కేజ్రీవాల్​ను సుకేశ్ ప్రశ్నించారు. సత్యేంద్ర జైన్​, కేజ్రీవాల్​లకు వ్యతిరేకంగా లేఖ రాసిన తరువాత తనకు బెదిరింపులు వస్తున్నాయని సుకేశ్ పేర్కొన్నాడు. తిహాడ్ జైలు మాజీ డీజీ నుంచి బెదిరింపులు వచ్చాయని ఎల్​జీకి రాసిన లేఖలో వివరించాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.