ETV Bharat / bharat

ఆపరేషన్ కమలం 2024.. ఎన్​డీఏ గూటికి ఓం ప్రకాశ్ రాజ్​భర్

author img

By

Published : Jul 16, 2023, 1:27 PM IST

Updated : Jul 16, 2023, 2:37 PM IST

NDA Expansion : రాబోయే లోక్​సభ​ ఎన్నికలే లక్ష్యంగా ఎన్​డీఏను విస్తరించే పనిలో నిమగ్నమైంది బీజేపీ. అందులో భాగంగా ఉత్తర్​ప్రదేశ్​లోని S.B.S.P. అధినేత ఓం ప్రకాశ్ రాజ్​భర్ తిరిగి కూటమిలో చేరారు.

NDA Expansion Omprakash Rajbhar
NDA Expansion Omprakash Rajbhar

NDA Expansion Omprakash Rajbhar : వచ్చే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్న వేళ.. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్​డీఏను బలోపేతం చేయటంపై దృష్టి సారించింది. పాతమిత్రులను తిరిగి ఎన్​డీఏ గూటికి తెచ్చేందుకు కొన్నిరోజుల నుంచి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తోంది. తూర్పు ఉత్తర్​ప్రదేశ్​లో ఓబీసీల్లో గట్టిపట్టున్న నేతగా గుర్తింపు పొందిన సుహెల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ అధినేత ఓం ప్రకాశ్ రాజ్​భర్.. తిరిగి ఎన్​డీఏ గూటికి చేరారు. ఈ మేరకు తన కుమారుడు అరవింద్​ రాజ్​భర్​తో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​ షాను కలిసి ఎన్​డీఏలో చేరినట్లు ప్రకటించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

  • #WATCH | SBSP chief Om Prakash Rajbhar speaks on his decision of joining the NDA alliance

    "We met Union Home Minister Amit Shah on July 14 and discussed various issues and decided to fight the 2024 elections together. I want to thank PM Modi, HM Amit Shah, CM Yogi Adityanath… pic.twitter.com/gvI0whp1dl

    — ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'బీజేపీ, ఎస్​బీఎస్​పీ ఒక్కటయ్యాయి. దేశంలో సామాజిక న్యాయం, భద్రత, సుపరిపాలన, అణగారిన వర్గాలు, దళితులు, మహిళలు, రైతులు, యువత, బలహీన వర్గాల కోసం.. భారతీయ జనతా పార్టీ, సుహెల్​దేవ్​ భారతీయ సమాజ్​ పార్టీ కలిసి పోరాడతాయి.'
--ఓం ప్రకాశ్​ రాజ్​భర్​, ఎస్​బీఎస్​పీ అధినేత

ఎన్​డీఏలోకి తిరిగి వచ్చిన ఓం ప్రకాశ్​ రాజ్​భర్, ఆయన కుమారుడిని అమిత్ షా స్వాగతించారు. 'ఓం ప్రకాశ్​ రాజ్​భర్​ను దిల్లీలో కలిశాను. ప్రధాని నేతృత్వంలోని ఎన్​డీఏలోకి రావాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎన్​డీఏలోకి ఓం ప్రకాశ్​కు స్వాగతించాను. రాజ్​భర్​ రాకతో ఉత్తర్​ప్రదేశ్​లో కూటమి బలం పెరుగుతుంది. పేదలు, అణగారిన వర్గాల సంక్షేమం కోసం మోదీ నేతృత్వంలో ఎన్​డీఏ చేస్తున్న కృషికి మరింత బలం చేకూరుతుంది' అని ట్వీట్ చేశారు.

  • श्री @oprajbhar जी से दिल्ली में भेंट हुई और उन्होंने प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व वाले NDA गठबंधन में आने का निर्णय लिया। मैं उनका NDA परिवार में स्वागत करता हूँ।

    राजभर जी के आने से उत्तर प्रदेश में एनडीए को मजबूती मिलेगी और मोदी जी के नेतृत्व में एनडीए द्वारा… pic.twitter.com/uLnbgJedbF

    — Amit Shah (@AmitShah) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఈనెల 18న జరిగే ఎన్​డీఏ సమావేశానికి హాజరుకానున్నట్లు రాజ్​భర్​ తెలిపారు. 2022 ఉత్తర్​ప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ నంచి వైదొలిగిన రాజ్​భర్.. సమాజ్​వాదీ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల్లో పోటీ చేశారు.
ఈనెల 18న నిర్వహించే ఎన్​డీఏ భాగస్వామ్యపక్షాల సమావేశంలో పాల్గొనాలని.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇటీవల లేఖలు రాశారు.

'రేపు ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు'
ఓం ప్రకాశ్ రాజ్​భర్​ తిరిగి ఎన్​డీఏలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్​ తివారీ స్పందించారు. ' రాజ్​భర్​​ ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్లారు. ఇది కొత్తేమీ కాదు. ఈరోజు ఎక్కడ ఉన్నారో.. రేపు ఆయన ఎక్కడ ఉంటారో మీరు ఊహించలేరు' అని ఆయన అన్నారు.

  • "Om Rajbhar returned to where he came from...this is nothing new. You can't predict anything about him like where he is today and where he will be tomorrow": Congress MP Pramod Tiwari on SBSP chief Om Prakash Rajbhar joining NDA alliance pic.twitter.com/9psuho22Fe

    — ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'కేంద్రం నుంచి ఓం ప్రకాశ్ రాజ్‌భర్​పై ఒత్తిడి ఉంది. గతంలో ఆయన బీజేపీ నుంచి విడిపోయినప్పుడు.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వెనుకబడిన తరగతుల ప్రజలకు వ్యతిరేకమని.. తాను చనిపోయినా ఎప్పటికీ బీజేపీలో చేరనని చెప్పారు' అని సమాజ్​వాదీ పార్టీ అధికార ప్రతినిధి అమీక్ జమీ అన్నారు.

  • #WATCH | "From Centre, there is some kind of pressure on him (Om Prakash Rajbhar)...when he got separated from BJP last time, he had told that he won't join BJP ever, even if he dies because BJP & RSS are against people of backward class...": Ameeque Jamei, National Spokesperson… https://t.co/OE1VgUncko pic.twitter.com/EsyRhDB9za

    — ANI (@ANI) July 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
Last Updated : Jul 16, 2023, 2:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.