SSC భారీ నోటిఫికేషన్​.. రూ.81వేలు జీతం.. ఇంటర్​ పాసైతే చాలు!

author img

By

Published : May 25, 2023, 7:28 AM IST

ssc chsl notification 2023ssc chsl notification 2023 last date to apply

SSC CHSL 2023 Notification : స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌ఎస్‌సీ) ఖాళీగా ఉన్న 1600 ల‌కు పైగా ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. దీనికి సంబంధించి ఖాళీలు, విద్యార్హ‌త‌లు, జీతం, వ‌య‌సుతో పాటు ఇత‌ర వివ‌రాలు తెలుసుకుందాం రండి.

SSC CHSL 2023 Notification : కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న సంస్థ స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ ఏటా ప‌లు విభాగాలు, మంత్రిత్వ శాఖ‌లు, సంస్థ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ను నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే ఈ ఏడాది కొన్ని పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ రిలీజ్ చేసిన ఎస్ఎస్​సీ.. తాజాగా కంబైన్డ్ హ‌య్యర్ సెకండ‌రీ లెవెల్ స్థాయిలో మ‌రో 1600కు పైగా ఖాళీల భ‌ర్తీకి మ‌రో నోటిఫికేష‌న్ రిలీజ్​ చేసింది. ఇందులో జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్, లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ త‌దిత‌ర పోస్టులున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకుందాం.

ఈ కంబైన్డ్ హ‌య్యర్ సెకండ‌రీ లెవెల్ స్థాయిలో పోస్ట‌ల్ అసిస్టెంట్ (పీఏ), సార్టింగ్ అసిస్టెంట్స్ (ఎస్ఏ), డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్ (డీఈవో), లోయ‌ర్ డివిజ‌న‌ల్ క్ల‌ర్క్ (ఎల్‌డీసీ), జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్ (జేఎస్ఏ), డేటా ఎంట్రీ ఆప‌రేటర్ (గ్రేడ్- ఏ) త‌దిత‌ర పోస్టులు ఉన్నాయి. వీటికి ఇంట‌ర్మీడియ‌ట్ పాసై ఉండాలి. ఇంట‌ర్ రెండో ఏడాది చ‌దివే వారు కూడా ఈ పోస్టులకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని పోస్టుల‌కు సైన్స్, మ్యాథ్స్ స‌బ్జెక్టులు త‌ప్ప‌ని స‌రిగా ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం:
SSC CHSL Apply Process : ఈ పోస్టుల‌కు ఆన్​లైన్​లోనే ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. అర్హులైన అభ్య‌ర్థులు స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ అధికారిక వెబ్​సైట్ www.ssc.nic.in లోకి వెళ్లి లాగిన్ అవ్వాలి. అనంత‌రం అప్లికేష‌న్ ఫారమ్​ను నింపాలి. త‌ర్వాత పాస్​పోర్టు సైజు ఫొటో, సంత‌కం వివ‌రాలు అప్​లోడ్ చేయాలి. త‌ర్వాత ఫీజు చెల్లించి స‌బ్మిట్ చేయాలి.

సిల‌బ‌స్:
SSC CHSL Syllabus : జ‌న‌ర‌ల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ అవేర్​నెస్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లీష్ కాంప్ర‌హెన్ష‌న్ ఉన్నాయి. ఆబ్జెక్టివ్ మల్టీపుల్ చాయిస్ విధానంలో ప్ర‌శ్న‌లుంటాయి. ప్ర‌తి సబ్జెక్టులో నుంచి 25 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. పరీక్ష స‌మ‌యం ఒక గంట (60 నిమిషాలు). నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్ర‌తి త‌ప్పు ప్ర‌శ్న‌కు 0.5 మార్కులు క‌ట్ అవుతాయి.

ఎంపిక ఇలా:
SSC CHSL Pattern : ముందుగా టైర్-1, టైర్-2 అనే రెండు ద‌శ‌ల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. టైర్-1లో కంప్యూట‌ర్ బేస్డ్ ఎక్సామ్ (సీబీటీ) ఉంటుంది. రెండో దాంట్లో సీబీటీతో పాటు స్కిల్ టెస్ట్ నిర్వ‌హించి అందులో ఉత్తీర్ణ‌త సాధించిన వారి ధ్రువప‌త్రాలను ప‌రిశీలిస్తారు. హిందీ, ఇంగ్లీష్ రెండు భాష‌ల్లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఆగ‌స్టు 2 నుంచి 22వ తేదీల మ‌ధ్య పరీక్షలు ఉండ‌నున్నాయి. ఎంపికైన అభ్య‌ర్థ్యుల‌కు జీతం.. పోస్టును బ‌ట్టి రూ. 19,900 నుంచి ప్రారంభ‌మై రూ. 81,100 వ‌ర‌కు ఉంది.

ముఖ్య‌మైన తేదీలు:
SSC CHSL Important Dates : ఈ నోటిఫికేషన్​కు సంబంధించిన ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లైంది. జూన్ 8న రాత్రి 11 గంట‌ల‌కు ఆన్​లైన్ అప్లికేష‌న్ల స్వీక‌ర‌ణ గ‌డువు ముగుస్తుంది. 10వ తేదీ వ‌ర‌కు ఆన్​లైన్ పేమెంట్ చేయ‌వ‌చ్చు. 14 నుంచి 15 తేదీల మ‌ధ్య అప్లికేష‌న్ విధానంలో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవ‌చ్చు.

అప్లికేష‌న్ ఫీజు:
SSC CHSL Application Fee : ఇక అప్లికేష‌న్ ఫీజు విష‌యానికి వ‌స్తే.. జ‌న‌ర‌ల్, ఓబీసీ కేట‌గిరీ వాళ్ల‌కు రూ.100, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ స‌ర్వీసు మెన్‌, మ‌హిళ‌లు ఫీజు చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. వయోపరిమితి 18 - 27 సంవ‌త్స‌రాలు. అర్హులైన వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.