ETV Bharat / bharat

మూడు రోజులు.. 12 గంటలు.. సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం

author img

By

Published : Jul 27, 2022, 12:14 PM IST

Updated : Jul 27, 2022, 2:53 PM IST

Sonia Gandhi appears before ED for third round of questioning in money laundering case
Sonia Gandhi appears before ED for third round of questioning in money laundering case

14:45 July 27

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీపై ఈడీ విచారణకు తెరపడింది. మూడు రోజుల పాటు విచారణ జరిపిన ఈడీ.. మొత్తం 12 గంటల పాటు సోనియాను ప్రశ్నించింది. ఈనెల 21న మూడు గంటలపాటు, నిన్న (మంగళవారం) రెండు దఫాలుగా ఆరు గంటల పాటు ఈడీ ప్రశ్నించింది.

ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈడీ అధికారులు ప్రశ్నించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో భోజన విరామం ఇచ్చిన అధికారులు తొలుత మధ్యాహ్నం 3.30 గంటలకు మళ్లీ రావాలని సోనియాకు చెప్పారు. కానీ తర్వాత మళ్లీ విచారణ ముగిసిందని ఈడి కేంద్ర కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అవసరం అయితే మరోసారి పిలుస్తామని చెప్పినట్లు తెలుస్తోంది.

14:15 July 27

ఇంటికి సోనియా గాంధీ
మనీలాండరింగ్​ కేసు విచారణ నిమిత్తం బుధవారం ఈడీ కార్యాలయానికి చేరుకున్న సోనియా తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈడీ సోనియాను దాదాపు మూడు గంటల పాటు విచారించింది.

13:12 July 27

పోలీసుల అదుపులోకి కాంగ్రెస్​ ఎంపీలు

సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్​ నేతలు దిల్లీలోని విజయ్​ చౌక్​ వద్ద ఆందోళనలు చేపట్టారు. మనీశ్​ తివారీ సహా పలువురు కాంగ్రెస్​ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. "పార్లమెంటులో సామాన్యుడి గొంతు వినిపించాలని అనుకుంటున్నాం. రాష్ట్రపతి భవన్​వైపు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు." అని మనీశ్​ తివారీ పేర్కొన్నారు.

12:44 July 27

11:56 July 27

మూడో రోజు ఈడీ విచారణకు సోనియా.. కాంగ్రెస్​ నిరసనలు ఉద్ధృతం

  • #WATCH Congress workers try to stop a train at Mumbai's Borivali railway station in protest against ED questioning of party's interim president Sonia Gandhi in National Herald case

    Some people came to stop the train but they didn't succeed, they've been detained: CPRO W.Railway pic.twitter.com/YPjTAAVENP

    — ANI (@ANI) July 27, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Sonia Gandhi ED News: నేషనల్​ హెరాల్డ్​ మనీలాండరింగ్​ కేసులో.. కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ మూడో రోజు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ విచారణకు హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు సోనియా. ఇప్పటివరకు 2 రోజుల్లో సోనియాను 70 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మొదటి రోజు 2 గంటలు, రెండోరోజైన మంగళవారం 6 గంటల పాటు ప్రశ్నించింది ఈడీ. తమ ప్రశ్నలకు సోనియా గాంధీ వెంటవెంటనే సమాధానాలు చెప్పినట్లు ఈడీ దర్యాప్తు అధికారులు వెల్లడింతారు. నేషనల్​ హెరాల్డ్​ దినపత్రిక వ్యవహారాల్లో సోనియా పాత్రపై ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.

సోనియాను ఈడీ ప్రశ్నించడాన్ని వ్యతిరేకిస్తూ పలు ప్రాంతాల్లో కాంగ్రెస్​ నిరసన కొనసాగుతోంది. కాంగ్రెస్​ పార్టీ ఎంపీలు.. పార్లమెంట్​ నుంచి విజయ్​ చౌక్​ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా జరిగేందుకు పోలీసులు వారి వెంట ఉన్నారు. ఈడీ దుర్వినియోగం ఆపాలని నినాదాలు చేసుకుంటూ ముందుకు సాగారు పార్టీ నేతలు.
ముంబయిలోని బొరివలిలో ఆ పార్టీ కార్యకర్తలు రైళ్ల రాకపోకలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైల్వే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని.. స్థానిక పోలీసులకు అప్పగించారు.

ఏంటీ కేసు?: కాంగ్రెస్‌కు నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్‌ ఇండియన్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్‌ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్‌ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.

Last Updated : Jul 27, 2022, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.