ETV Bharat / bharat

Six People Killed In Old Factions : ఇద్దరి మధ్య వివాదం.. ఒకే కుటుంబంలోని ఐదుగురు బలి.. ఏం జరిగింది?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 2, 2023, 11:03 AM IST

Updated : Oct 2, 2023, 12:19 PM IST

Six People Killed In Old Factions : ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన భూవివాదం ఆరుగురి ప్రాణాలు తీసింది. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని దేవరియా జిల్లాలో జరిగింది.

Six People Killed In Old Factions
Six People Killed In Old Factions

Six People Killed In Old Factions : ఉత్తర్​ప్రదేశ్​.. దేవరియా జిల్లాలో దారుణం జరిగింది. భూవివాదం కారణంగా ఇద్దరు చిన్నారులు సహా ఒకే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు. సోమవారం జరిగిన ఈ హత్యలపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. రుద్రపుర్ పోలీస్​ స్టేషన్ పరిధిలోని ఫతేపుర్ గ్రామ పంచాయతీ.. లెధాన్ టోలె ప్రాంతంలో సత్యప్రకాశ్​ దుబే అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. సత్యప్రకాశ్​.. అభయ్​పురా టోలెకు చెందిన మాజీ జిల్లా పంచాయజీ సభ్యడు ప్రేమ్​చంద్​ మధ్య కొంత కాలంగా భూవివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం ప్రేమ్​చంద్ దారుణ​ హత్యకు గురయ్యాడు. దీంతో ఈ పని సత్యప్రకాశ్​ చేశాడని కోపంతో ఊగిపోయిన కొందరు దుండగులు.. అతడి ఇంటిపై దాడికి దిగారు. సత్యప్రకాశ్​పై మొదటి దాడి చేసి చంపిన నిందితులు.. అనంతరం అతడి​ భార్య, ఇద్దరు పిల్లలు సహా మరో వ్యక్తిని హత్య చేశారు. ఈ దాడిలో మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Six People Killed Over Land Dispute : ఈ సామూహిక హత్య ఘటనపై సమచారం అందుకున్న ఎస్​పీ సంకల్ప్​ శర్మ.. పోలీసులను ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులతో పాటు జిల్లా మేజిస్ట్రేట్ అఖండ్​ ప్రతాప్​ సింగ్​ కూడా ఘటనాస్థలిని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. శవపరీక్షల కోసం దేవరహా బాబా మహర్షి మెడికల్​ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఓ బాలిక సహా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఎస్​పీ తెలిపారు. నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నామని చెప్పారు.

నిందితులను వదిలిపెట్టబోం : యోగి ఆదిత్యనాథ్​
ఈ ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ స్పందించారు. "దేవరియా జిల్లాలో జరిగిన దురదృష్టకర ఘటన చాలా బాధాకరం. ఖండించదగినది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా. కఠిన చర్యలు తీసుకోవాలని ఏజీజీ/కమిషనర్/ఐజీని ఆదేశించాను. జిల్లా యంత్రాంగం గాయపడిన వారికి మెరగైన చికిత్స అందించాలని ఆదేశించాను. ఈ ఘటనకు కారకులైన వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిపెట్టబోం" అని ఎక్స్​లో పోస్ట్​ చేశారు.

ఫేమస్​ అయ్యేందుకు ఐదుగురిని హత్య చేసిన యువకుడు.. నెక్ట్స్​ టార్గెట్​ పోలీసులేనట!

జాబ్ వదిలేస్తామన్నందుకే 8 మంది దారుణ హత్య.. ముక్కలుగా నరికి సంచుల్లో కుక్కి..

Last Updated :Oct 2, 2023, 12:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.