ETV Bharat / bharat

కరోనాతో యూపీ విలవిల- వేధిస్తున్న ఆక్సిజన్​  కొరత!

author img

By

Published : Apr 21, 2021, 7:13 PM IST

Updated : Apr 21, 2021, 9:38 PM IST

Severe oxygen crunch leaves UP on edge
కరోనాతో యూపీ విలవిల- ఆక్సిజన్​కు తీవ్ర కొరత!

కరోనా ఉద్ధృతి.. ఉత్తర్​ప్రదేశ్ వైద్య వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపుతోంది. రాష్ట్రంలోని చాలా చోట్ల ఆక్సిజన్ కొరత ఏర్పడింది. రోగులు.. ఆక్సిజన్​ సిలిండర్లను వెంటతెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఔషధాలు, వెంటిలేటర్లు సరిపడా అందుబాటులో లేవని తెలుస్తోంది.

కరోనా తొలి దశ వ్యాప్తి నుంచి ప్రజలు ఇంకా తేరుకోకముందే.. దేశాన్ని రెండో వేవ్​ వణికిస్తోంది. తొలి దశకు మించిన విధ్వంసాన్ని సృష్టిస్తోంది. రెండో దశ కరోనా వ్యాప్తి మరింత ప్రమాదకరంగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయం రోజువారీ కేసులు, మరణాల్లో స్పష్టమవుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా వ్యాప్తి ఎంత తీవ్రంగా ఉందో.. ఉత్తర్​ప్రదేశ్​లోనూ పరిస్థితి అంతే ప్రమాదకరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఎవరి ఆక్సిజన్​ వారే..

కరోనా కట్టడిలో సమర్థంగా పనిచేశామని గతేడాది చెప్పుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. ఇప్పుడు నిస్సహాయంగా కనిపిస్తున్నారు. ఆస్పత్రులలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పడకలు, వెంటిలేటర్లు, ఔషధాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్ అందించడమే యూపీ సర్కార్ ముందు అతిపెద్ద సవాల్​గా మారింది. ప్రజలు తమకు తాముగా ఆక్సిజన్ సిలిండర్లను వెంటతెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే అదనుగా భావించిన అక్రమాసురులు.. బ్లాక్ మార్కెట్ దందాకు తెరతీశారు. బహిరంగంగా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం వల్ల.. ప్రజలు తప్పనిసరై.. బ్లాక్ మార్కెట్ నుంచే అధిక ధరకు కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా విక్రయిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటం వల్ల.. యూపీ వైద్య వ్యవస్థపై ఊహించని ఒత్తిడి నెలకొంది. అన్ని ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య సామర్థ్యానికి మించిపోయింది. కొత్త రోగుల కోసం పడకలుఅందుబాటులో లేవు. అప్పటికే అడ్మిట్ అయిన రోగులు.. సరైన వసతులు లేక నరకం అనుభవిస్తున్నారు. రాష్ట్ర రాజధాని అయిన లఖ్​నవూలోనూ ఇదే పరిస్థితి. ప్రజలతో పాటు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా కేసుల పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది.

Severe oxygen crunch leaves UP on edge
కరోనా రోగులు.. అందుబాటులో ఉన్న ఆక్సిజన్​ నిల్వలు

ఇదీ చదవండి: ఆక్సిజన్ లీకేజీతో 22 మంది మృతి- ప్రధాని సంతాపం

ఇదీ చదవండి: 'నోట్లరద్దులాగే.. వ్యాక్సినేషన్​లోనూ కేంద్రం విఫలం'

తరిగిపోతున్న నిల్వలు..

రాష్ట్ర యంత్రాంగం మొత్తం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైంది. ప్రభుత్వం దగ్గరుండి కరోనా కట్టడికి కృషి చేయాల్సిన సమయంలో.. పక్క రాష్ట్రాల ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూపీ రాజధానిలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉంది. లఖ్​నవూలోని అనేక ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలు క్రమంగా తగ్గిపోతున్నాయి. హోం ఐసోలేషన్​లో ఉన్న రోగుల పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. ఆస్పత్రిలో అడ్మిట్ అవ్వాలనుకున్నా.. బెడ్స్ లేకపోవడం సమస్యగా మారింది. నగరంలోని ఆక్సిజన్ ప్లాంట్​లో ఇదివరకు రోజుకు 4,500 సిలిండర్లను నింపుతుండగా.. ఇప్పుడా సామర్థ్యాన్ని 5,500కు పెంచారు.

ఇదీ చదవండి: వృద్ధాశ్రమంలో 58మందికి కరోనా.. ఇద్దరు మృతి

మోదీ నియోజకవర్గం..వారణాసిలోనూ కరోనా కట్టలు తెంచుకుంటోంది. పూర్తిస్థాయిలో వసతులు లేకపోవడం.. ఆందోళన
కలిగిస్తోంది. అవసరం ఉన్న రోగుల్లో 70 శాతం మందికి మాత్రమే ఆక్సిజన్ అందుతోంది. పక్క జిల్లాల నుంచి 3250 ఆక్సిజన్ సిలిండర్లను ప్రతి రోజు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం వారణాసి ఆస్పత్రుల్లో 2,011 పడకలు ఉండగా.. అందులో 1200 బెడ్లకే ఆక్సిజన్ సరఫరా అందుబాటులో ఉంది.

మథురాలోనూ.. కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది జిల్లా యంత్రాంగం. కరోనా పేషెంట్ల కోసం 600 బెడ్లను రిజర్వ్ చేసింది. ఇక్కడి ఆస్పత్రులు.. రోజుకు 18-20 ఆక్సిజన్ సిలిండర్లను ఉపయోగిస్తున్నాయి. కరోనా బాధితుల సంఖ్య పెరిగితే ఆక్సిజన్​కు డిమాండ్ అధికమవుతుంది. ఇందుకోసం సిద్ధంగా ఉన్నట్లు జిల్లా అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: అంబులెన్స్​ కోసం రోజూ 9000 ఫోన్ కాల్స్!

యోగి చర్యలు..

ఈ నేపథ్యంలో యూపీలో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రాణాలు కాపాడే ఔషధాలు, మెడికల్ కిట్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 15 రోజుల డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ప్రతి ఆస్పత్రికి 36 గంటల ఆక్సిజన్ బ్యాకప్ ఉండాలని స్పష్టం చేశారు. సిలిండర్ల కొనుగోలులో జాప్యం ఉండకూడదని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి: కరోనా వైరస్​పై 'కొవాగ్జిన్​' 78 శాతం ప్రభావవంతం

కరోనాతో ప్రముఖ రచయిత మృతి

Last Updated :Apr 21, 2021, 9:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.