ETV Bharat / bharat

బస్సుపై విరిగిపడ్డ కొండ- 10 మంది మృతి

author img

By

Published : Aug 11, 2021, 1:35 PM IST

Updated : Aug 11, 2021, 6:44 PM IST

హిమాచల్ ప్రదేశ్​లోని కిన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద ఓ బస్సు సహా మొత్తం నాలుగు వాహనాలు చిక్కుకుపోయినట్లు సమాచారం. బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, మొత్తంగా 50-60 మంది వరకు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందగా.. డ్రైవర్​, కండక్టర్​ సహా మరో 12 మంది వరకు కాపాడినట్లు చెప్పారు.

Several people feared buried
కొండచరియలు విరిగిపడి అనేక మంది జీవసమాధి

హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రకృతి మరోసారి కన్నెర్ర చేసింది. కిన్నౌర్‌ జిల్లాలోని రెకాండ్‌ పియో- సిమ్లా రహదారిపై పెద్ద ఎత్తున.. కొండచరియలు విరిగిపడటం వల్ల శిథిలాల కింద 50-60మందికి పైగా చిక్కుకుపోయారు. బుధవారం మధ్యాహ్నం 12:45 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.

  • #WATCH | ITBP personnel rescue a man trapped in the debris of a landslide on Reckong Peo-Shimla Highway in Nugulsari area of Kinnaur, Himachal Pradesh

    As per the state govt's latest information, nine people have been rescued & one person has died. Search operation is underway pic.twitter.com/NZ46tpg1Se

    — ANI (@ANI) August 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

కిన్నౌర్‌ నుంచి సిమ్లాకు వెళ్తోన్న హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వ రవాణాకు చెందిన ఓ ప్రయాణికుల బస్సు, ఓ ట్రక్కు, కొన్ని కార్లు కొండచరియల కింద చిక్కుకున్నట్లు ఐటీబీపీ పోలీసులు వెల్లడించారు. బస్సులోనే సుమారు 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు కిన్నౌర్‌ డిప్యూటి కమిషనర్‌ హుస్సేన్‌ సిద్ధిఖ్‌ చెప్పారు.

బస్సు డ్రైవర్​ సహా 9 మంది సురక్షితం..

landslide in himachal pradesh
కొండచరియలు విరిగిపడ్డ ప్రాంతం

ప్రమాదస్థలిలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, సీఐఎస్ఎఫ్​, ఐటీబీపీ 17, 19, 43వ బెటాలియన్​ బలగాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బస్సు డ్రైవర్, కండక్టర్​ సహా.. మరో 12 మందిని బలగాలు రక్షించినట్లు సీఎం జైరామ్​ ఠాకూర్​ తెలిపారు. బస్సులో ఉన్న ప్రయాణికుల సంఖ్యను తెలిపే స్థితిలో వారు లేరని చెప్పారు. మిగిలిన వారి ఆచూకీ కోసం కూడా బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు చెప్పారు.

landslide in himachal pradesh
విరిగిపడ్డ కొండచరియలు

సీఎంకు ప్రధాని ఫోన్​..

హిమాచర్​ ప్రదేశ్​ సీఎం జైరామ్​ ఠాకూర్​కు ఫోన్ చేసి ప్రమాదంపై ఆరా తీశారు ప్రధాని నరేంద్ర మోదీ. సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్​కు అన్ని విధాల మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది.

అమిత్​ షా ఆరా..

ప్రమాదంపై హోంమంత్రి అమిత్‌ షా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరామ్‌ ఠాకూర్‌కు ఫోన్‌ చేసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్​కు కావాల్సిన పూర్తి సహకారాన్ని అందించనున్నట్లు అమిత్‌షా భరోసా ఇచ్చారు. మరోవైపు స్థానిక పోలీసులను, సహాయక సిబ్బందిని సీఎం జైరామ్‌ ఠాకూర్‌ అప్రమత్తం చేశారు. యుద్ధప్రాతిపదికన చర్యలు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Last Updated : Aug 11, 2021, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.