భారత నౌకాదళంలో చేరిన ఐఎన్​ఎస్​ కరంజ్​

author img

By

Published : Mar 10, 2021, 12:31 PM IST

Updated : Mar 10, 2021, 12:45 PM IST

Scorpene-class submarine INS Karanj commissioned into Indian Navy

భారత నౌకాదళంలోకి స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌- కరంజ్‌ చేరింది. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు.

స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి ఐన్​ఎస్​-కరంజ్‌ను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సముద్ర జలాల్లోకి కరంజ్​ చేరింది. ఈ కార్యక్రమంలో నౌకాదళ అధిపతి అడ్మిరల్ కరమ్‌వీర్ సింగ్ పాల్గొన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపాదించిన అత్మనిర్భర దృక్పథంపై ప్రశంసలు కురిపించారు.

Scorpene-class submarine INS Karanj commissioned into Indian Navy
భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్​ఎస్​ కరంజ్​

ప్రస్తుత, భవిష్యత్ అవసరాల కోసం నౌకాదళం ఆత్మనిర్భరతను అనుసరిస్తుందని కరమ్‌వీర్ చెప్పారు. గడచిన ఏడు దశాబ్దాల్లో భారత నౌకాదళం స్వయం సమృద్ధి దిశగా ఎంతో ప్రగతి కనబరించిందని కరమ్‌వీర్ చెప్పారు. ప్రస్తుతం నౌకాదళంలో ఉన్న 42 నౌకలు, జలాంతర్గాములలో దాదాపు 40 వరకూ భారతీయ షిప్‌యార్డులలో అభివృద్ధి చేసినవేనని కరమ్‌వీర్ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఏరోఇండియా షో వేదికగా నేడు 'తేజస్​' కొనుగోలు ఒప్పందం

Last Updated :Mar 10, 2021, 12:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.