'ప్రభుత్వ స్కూల్​ బాలికలకు ఫ్రీగా సానిటరీ ప్యాడ్స్​'.. ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

author img

By

Published : Nov 28, 2022, 3:17 PM IST

sc on sanitary pads

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్స్​ ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్​పై కేంద్రం సహా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది సుప్రీంకోర్టు.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 12 వరకు చదివే బాలికలకు ఉచితంగా సానిటరీ ప్యాడ్స్​ ఇవ్వాంటూ దాఖలైన పిటిషన్​ను విచారించింది సుప్రీంకోర్టు. దీనిపై తమ వైఖరి తెలపాలంటూ కేంద్రం సహా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రతి పాఠశాలలో బాలికలకు టాయిలెట్లు నిర్మించాలని పిటిషనర్​ పేర్కొన్నారు.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​, జస్టిస్​ పీఎస్​ నరసింహతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్​ను విచారించింది. దీనిపై సొలిసిటర్ జనరల్​ తుషార్​ మెహతా సహకారం కావాలని కోరింది. మధ్యప్రదేశ్​కు చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్​ జయా ఠాకూర్​ ఈ పిటిషన్​ను దాఖలు చేశారు.

ఇవీ చదవండి: 'నా ఉద్దేశం అది కాదు.. క్షమించండి'.. ఆమెకు రాందేవ్​ బాబా లేఖ

యువతిపై తండ్రీకొడుకులు రేప్​.. స్కూల్​ టాయిలెట్​లో చిన్నారికి జన్మనిచ్చిన మైనర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.