ETV Bharat / bharat

ఆ మహిళలకు మౌలిక సదుపాయాలపై కేంద్రానికి నోటీసులు

author img

By

Published : Nov 8, 2021, 12:54 PM IST

గృహ హింస ఎదుర్కొంటున్న మహిళలకు (PIL on domestic violence) న్యాయ సహాయం పొందేలా.. సరైన మౌలిక సదుపాయాలు కోరుతూ దాఖలైన పిటిషన్​పై కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 6లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

Domestic Violence Act in india
గృహ హింసపై సుప్రీంకోర్టు

గృహ హింసను ఎదుర్కొంటున్న మహిళలకు (PIL on domestic violence)న్యాయ సహాయం, పునరావాసం పొందేలా.. మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇళ్లలో వేధింపులకు గురవుతున్న మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ దాఖలైన పిల్​పై జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్​ ఎస్.రవీంద్ర భట్​ ధర్మాసనం విచారణ జరిపింది. డిసెంబర్ 6లోగా కేంద్రం తమ స్పందనను తెలపాలని ఆదేశించింది.

గృహ హింసా చట్టం 2005 అమలోకి వచ్చి 15 ఏళ్లు గడిచినా.. ఇంకా మహిళలపై ఇళ్లలో వేధింపులు ఆగడం లేదని పిటిషనర్​ పేర్కొన్నారు. 2019 ప్రకారం 4.05 లక్షల మహిళా వేధింపుల కేసులు నమోదైతే.. అందులో 30 శాతం గృహ హింసకు సంబంధించినవి ఉండటం గమనార్హం. 86 శాతం మంది బాదితులు సహాయం కోసం ముందుకు రాకుండా ఇళ్లలోనే మగ్గుతున్నారని పిటిషనర్​ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:దిల్లీలో ప్రమాదకర స్థాయికి గాలి నాణ్యత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.