ETV Bharat / bharat

భారత్​లో బీబీసీ బ్యాన్!.. పిటిషన్​ను కొట్టేసిన సుప్రీంకోర్టు

author img

By

Published : Feb 10, 2023, 3:15 PM IST

బీబీసీను భారత్​లో బ్యాన్ చేయాలంటూ వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిట్‌ పిల్​లో మెరిట్‌ లేనందున ఈ పిటిషన్​ను కొట్టివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

SC dismissed petition filed against ban of BCCI
సుప్రీంకోర్టు

బీబీసీ వార్తాసంస్థను భారత్‌లో నిషేధించాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తాతోపాటు మరో వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. భారత్‌, ప్రధాని మోదీ ఎదుగుదలను చూసి ఒర్వలేక కుట్రపూరితంగా బీబీసీ డాక్యుమెంటరీని రూపొందించిందని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రిట్‌ పిటిషన్‌లో మెరిట్‌ లేనందున కొట్టివేస్తున్నట్లు సుప్రీం ధర్మాసనం పేర్కొంది.

2002లో గోద్రా అల్లర్లపై బీబీసీ తీసిన డాక్యుమెంటరీ మోదీ ప్రతిష్టను దిగజార్చడం సహా భారత సామాజిక వ్యవస్థకు నాశనం చేసే విధంగా ఉందని పిటిషనర్​ తెలిపారు. మరోవైపు బీబీసీ డాక్యుమెంటరీని కేంద్రం నిషేధం విధించడంపై పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్పందనను తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అసలేంటి బీబీసీ డాక్యుమెంటరీ..?
2002లో గోద్రా ప్రాంతంలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ పాత్రను విమర్శనాత్మకంగా చూపించింది బీబీసీ మీడియా సంస్థ. 'ఇండియా: ద మోదీ క్వశ్చన్​' పేరుతో రెండు ఎపిసోడ్​ల సిరీస్‌ను బీబీసీ రూపొందించింది. ఇందులో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ కేంద్ర ప్రభుత్వం దీని ప్రసారంపై నిషేధం విధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.