ETV Bharat / bharat

Gujarat Riots: 'మోదీకి క్లీన్​చిట్​'​పై సుప్రీంలో 26న విచారణ

author img

By

Published : Oct 6, 2021, 7:44 AM IST

గుజరాత్ అల్లర్ల(Gujarat Riots) కేసులో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీకి (ప్రస్తుత ప్రధానమంత్రి) ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్​పై ఈ నెల 26న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో మరిన్ని వాయిదాలు కోరేందుకు పిటిషన్‌దారును అనుమతించబోమని స్పష్టం చేసింది.

modi role in Gujarat Riots case
గుజరాత్​ అల్లర్ల కేసులో మోదీ

2002 నాటి గుజరాత్‌ అల్లర్ల కేసులో(Gujarat Riots) అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీకి(Narendra Modi Gujarat Riots) ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) క్లీన్‌చిట్‌(Sit Clean Chit To Modi) ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్‌ దివంగత నేత ఎహ్సాన్‌ జాఫ్రీ భార్య జాకియా జాఫ్రీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 26న విచారణ చేపట్టనున్నట్లు సుప్రీం కోర్టు వెల్లడించింది. ఈ కేసులో(Gujarat Riots) మరిన్ని వాయిదాలు కోరేందుకు పిటిషన్‌దారును అనుమతించబోమని స్పష్టం చేసింది. కేసుకు నంబంధించి అదనపు పత్రాలు సమర్పించేందుకు మాత్రం అనుమతి మంజూరు చేసింది.

అంతకుముందు, జాకియా తరపున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్‌ ప్రస్తుతం ఆకస్మికంగా విచారణకు వచ్చిందని పేర్కొన్నారు. దానిపై శుక్రవారమే తమకు సమాచారం అందిందన్నారు. దాదాపు 23 వేల పేజీల వరకు దస్త్రాలు ఉండటంతో వాటిని సమీకరించేందుకు వీలుగా విచారణను నిర్దిష్ట తేదీకి వాయిదా వేయాలని విన్నవించారు.

దీనికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ... ఏడాదిన్నరగా పిటిషన్‌దారు ఇదే కారణం చూపుతూ వాయిదా కోరుతున్నారని పేర్కొన్నారు. దీంతో... ఇకపై వాయిదాలను అనుమతించబోమని జస్టిస్‌ ఎ.ఎం. ఖాన్విల్కర్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. గుజరాత్‌ అల్లర్ల(Gujarat Riots) వేళ.. 2002 ఫిబ్రవరి 28న అహ్మదాబాద్‌లోని గుల్బర్గ్‌ సొసైటీలో మృత్యువాతపడ్డ 68 మందిలో ఎహ్సాన్‌ జాఫ్రీ (మాజీ ఎంపీ) ఒకరు. 2012లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి మోదీ సహా 63 మందికి ఈ కేసులో సిట్‌ క్లీన్‌చిట్‌ ఇచ్చింది. దాన్ని సవాలుచేస్తూ తాను దాఖలు చేసిన పిటిషన్‌ను రాష్ట్ర హైకోర్టు 2017లో కొట్టివేయడంతో.. 2018లో జాకియా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఇదీ చూడండి: ఉద్రిక్తతల మధ్య లఖింపుర్​కు రాహుల్​ గాంధీ!

ఇదీ చూడండి: లఖింపుర్​ ఖేరి ఘటనపై దేశవ్యాప్తంగా ప్రకంపనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.