ETV Bharat / bharat

రూ.1439 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

author img

By

Published : Apr 25, 2022, 11:48 AM IST

Updated : Apr 25, 2022, 1:12 PM IST

Heroin Seize In Gujarat: గుజరాత్​లో భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుకున్నారు అధికారులు. కాండ్లా పోర్టులో రూ. 1439 విలువ చేసే 205 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో పాకిస్థాన్​కు చెందిన పడవలో 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను పట్టుకున్నారు.

drugs seized in gujarat
drugs seized in gujarat

1439 Crores Heroin Seize In Gujarat: గుజరాత్​లోని కాండ్లా పోర్టులో భారీ మొత్తంలో హెరాయిన్​ను పట్టుకున్నారు. సుమారు రూ. 1439 కోట్ల విలువ గల 205 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్​ ఏటీఎస్​, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్​ను చేపట్టారు. ఉత్తరాఖండ్​కు చెందిన ఓ సంస్థ ఇరాన్​లోని బందర్​ అబ్బాస్​ పోర్టుకు తరలిస్తుండగా కాండ్లాలో పట్టుకున్నారు.

హెరాయిన్​ను అక్రమంగా తరలిస్తున్న సరఫరాదారుడిని గుర్తించేందుకు డీఆర్​ఐ.. దేశంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టింది. అధికారుల నుంచి తప్పించుకునేందుకు నిందితుడు.. పంజాబ్​లోని ఓ గ్రామంలో తలదాచుకున్నాడు. అయితే, సమాచారం అందుకున్న అధికారులు అక్కడికి వెళ్లగా.. పారిపోయేందుకు యత్నించాడు. ఎట్టకేలకు అతడ్ని పట్టుకున్న అధికారులు.. ఎన్​డీపీఎస్​ చట్టం1985 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Heroin Seize In Gujarat: ఇదిలా ఉంటే గుజరాత్​లో మరోచోట.. 280 కోట్ల రూపాయలు విలువైన హెరాయిన్‌ను పట్టుకుంది భారత తీరప్రాంత రక్షణ దళం. భారత్‌ వైపు వస్తున్న పాకిస్తాన్‌కు చెందిన పడవలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్‌ ఉగ్రవాద నిరోధక దళంతో కలిసి ఈ ఆపరేషన్​ను చేపట్టారు.

రెండు దళాలు సంయుక్తంగా చేసిన ఈ ఆపరేషన్‌లో హెరాయిన్‌ను అక్రమంగా తరలిస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ చేసిన నిందితులను.. కచ్‌ జిల్లాలోని జకావూ పోర్టుకు తరలించినట్లు అధికారులు తెలిపారు. పాకిస్థానీ బోట్ 'అల్ హజ్' భారత జలాల్లోకి ప్రవేశించినప్పుడు తీర ప్రాంత రక్షణ నౌకలు అడ్డుకుని పట్టుకున్నాయని పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి: ప్రియురాలిని మోసం చేసిన ప్రముఖ నటుడు అరెస్ట్​

Last Updated :Apr 25, 2022, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.