ETV Bharat / bharat

ఐటీ దాడుల్లో రూ.100 కోట్ల నల్లధనం పట్టివేత

author img

By

Published : Nov 1, 2021, 3:57 PM IST

బిహార్, ఝార్ఖండ్​లో కార్యకలాపాలు సాగించే రోడ్డు కాంట్రాక్ట్​ నిర్వహణ సంస్థపై ఐటీ అధికారులు దాడులు జరిపారు. రూ.100 కోట్ల నల్లధనం బయటపడినట్లు వెల్లడించారు.

CBDT
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు

బిహార్, ఝార్ఖండ్​లో కార్యకలాపాలు సాగించే ప్రముఖ రోడ్డు కాంట్రాక్ట్​ నిర్వహణ సంస్థపై ఐటీ శాఖ దాడులు జరిపింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల నల్లధనం బయటపడింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.

అక్టోబరు 27న బిహార్​, ఝార్ఖండ్​, బంగాల్, మహారాష్ట్రలోని కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించినట్లు సీబీడీటీ పేర్కొంది.

ఇదీ చూడండి: కొమ్ములతో కుమ్మేసిన ఎద్దు- వృద్ధురాలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.