ETV Bharat / bharat

ఇంటర్​, డిగ్రీ అర్హతతో RPFలో 2250 సబ్​-ఇన్​స్పెక్టర్​ & కానిస్టేబుల్ ఉద్యోగాలు

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 5, 2024, 10:39 AM IST

RPF Recruitment 2024 In Telugu : రైల్వే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్​ (RPF)లోని 250 సబ్​-ఇన్​స్పెక్టర్​, 2000 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హతలు, ఏజ్​ లిమిట్​, ఫీజు, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

RPF Constable and SI Jobs
RPF Recruitment 2024

RPF Recruitment 2024 : రైల్వే ప్రొటక్షన్​ ఫోర్స్​ (RPF), రైల్వే ప్రొటక్షన్ స్పెషల్​ ఫోర్స్​ (RPSF)ల్లోని 2250 పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ ఒక​ ప్రకటన విడుదల చేసింది. ఈ రిక్రూట్​మెంట్ ద్వారా 250 సబ్​-ఇన్​స్పెక్టర్​,​ 2000 కానిస్టేబుల్​ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఉద్యోగాల వివరాలు

  • సబ్​-ఇన్​స్పెక్టర్​ - 250 పోస్టులు
  • కానిస్టేబుల్​ - 2000 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 2250

విద్యార్హతలు

  • సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు అప్లై చేయాలంటే, అభ్యర్థులు కచ్చితంగా డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
  • కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి, 10+2 క్వాలిఫై అయ్యుండాలి.

వయోపరిమితి

  • సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 20 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • కానిస్టేబుల్​ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 25 ఏళ్లలోపు ఉండాలి.
  • ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్​ ఫీజుగా రూ.500 చెల్లించాలి.
  • ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్​మెన్​, ఈబీసీ కేటగిరీల అభ్యర్థులు, మహిళలు అప్లికేషన్​ ఫీజుగా రూ.250 చెల్లిస్తే సరిపోతుంది.

ఎంపిక విధానం
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఫిజికల్​ ఎఫీషియన్సీ టెస్ట్​ (PET), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​ (PST) చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా రైల్వే ప్రొటక్షన్​ ఫోర్స్ అధికారిక వెబ్​సైట్​ https://rpf.indianrailways.gov.in ఓపెన్ చేయాలి.
  • ఈ పోర్టల్​లో మీ వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్, ఈ-మెయిల్ వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.​
  • వెంటనే మీ ఈ-మెయిల్ అడ్రస్​కు ఒక లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​ వస్తాయి.
  • ఈ లాగిన్ ఐడీ, పాస్​వర్డ్​లతో మీరు మళ్లీ వెబ్​సైట్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్​ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • స్కాన్ చేసిన ఫొటో, సంతకం సహా, అవసరమైన డాక్యుమెంట్లు అన్నీ అప్​లోడ్ చేయాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్​ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్ భద్రపరుచుకోవాలి.

ఆన్​లైన్ అప్లై డేట్స్​ : దరఖాస్తు స్వీకరణ, ముగింపు తేదీల వివరాలు వెల్లడించాల్సి ఉంది.

ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​లో అగ్నివీర్ వాయు జాబ్స్​కు నోటిఫికేషన్ రిలీజ్

ఇంజినీరింగ్ అర్హతతో BELలో 115 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.