ETV Bharat / bharat

చెరువు మధ్యలో దాక్కున్న 'రౌడీ'.. డ్రోన్ సాయంతో పట్టేసిన పోలీసులు

author img

By

Published : Mar 18, 2022, 3:18 PM IST

Updated : Mar 18, 2022, 3:42 PM IST

Drone camera criminal arrest: పోలీసులకు దొరక్కుండా చెరువులోని పొదల్లో నక్కిన ఓ 'రౌడీ'ని డ్రోన్​ కెమెరా పట్టించింది. హత్యాయత్నం కేసులో అరెస్ట్​ చేసేందుకు యత్నించగా పరారై చెరువులో దాక్కున్న నిందితుడిని టెక్నాలజీ సాయంతో అరెస్ట్​ చేసిన ఈ సంఘటన తమిళనాడులోని తెన్కాసి జిల్లాలో జరిగింది.

drone camera
చెరువు మధ్యలో నక్కినా పట్టించిన డ్రోన్​ కెమెరా

చెరువు మధ్యలో దాక్కున్న రౌడీని పట్టించిన డ్రోన్​ కెమెరా

Drone camera criminal arrest: సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత నేరస్థులను గుర్తించటం చాలా సులభమైంది. ఇప్పుడు వాటికి డ్రోన్​ కెమెరాలు తోడయ్యాయి. పోలీసులకు దొరక్కుండా చెరువు మధ్యలోని పొదల్లో నక్కిన ఓ 'రౌడీ'ని డ్రోన్​ కెమెరాలు పసిగట్టాయి. ఈ సంఘటన తమిళనాడు తెన్కాసి జిల్లాలో జరిగింది.

ఇదీ జరిగింది..

తెన్కాసి జిల్లాకు చెందిన జకుల్​ హమీద్​ అనే వ్యక్తిపై పలు స్టేషనల్లో క్రిమినల్​ కేసులు పెండింగ్​లో ఉన్నాయి. ఓ హత్యాయత్నం కేసులో పోలీసులు హమీద్​ కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం తెన్కాసి పచనాయకంపొట్టై ప్రాంతానికి వెళ్లి నివాసం ఏర్పరచుకున్నాడు. తన వద్దకు ఎవరూ రావొద్దని అక్కడి ప్రజలను బెదిరించాడు.

ఓ రోజు బీర్​ మొహమ్మద్​ అనే స్థానికుడు పశువులను మేపుతూ అటుగా వెళ్లగా పదునైన ఆయుధంతో అతనిపై జకుల్​ హమీద్​ దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన బీర్​ మొహమ్మద్​ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. హత్యాయత్నంపై సమాచారం అందుకున్న తెన్కాసి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. జకుల్​ కోసం గాలింపు చేపట్టగా.. వారికి దొరకకుండా.. ఆ సమీపంలోని చెరువు వైపు వెళ్లి కనిపించకుండా పోయాడు.

చెరువు సమీపంలో జకుల్​ను చూసినట్లు కొందరు మహిళలు పోలీసులకు చెప్పారు. చెరువులో నక్కినట్లు అంచనాకు వచ్చిన పోలీసులు.. ఉన్నతాధికారులతో సంప్రదించారు. డ్రోన్​ కెమెరాను తెప్పించి గాలింపు చేపట్టారు. చెరువు మధ్యలో పొదల్లో నక్కిన జకుల్​ హమీద్​ను ఆ డ్రోన్​ కెమెరా గుర్తించింది. దానిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న పోలీసులు పట్టుకుని స్టేషన్​కు తరలించారు.

ఇదీ చూడండి: 'శ్రీవల్లి'ని వాయించిన ముంబయి పోలీసులు

Last Updated : Mar 18, 2022, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.