ఏకే-47 కేసులో ఎమ్మెల్యేకు పదేళ్లు జైలు శిక్ష- పదవి పోవడం ఖాయం!

author img

By

Published : Jun 21, 2022, 2:43 PM IST

RJD MLA Anant Singh sentenced in AK 47 case
అక్రమ ఆయుధాల కేసులో ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష ()

ఆర్జేడీ ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డింది. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన పట్నా ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు ఈ తీర్పును వెలువరించింది.

అక్రమ ఆయుధాల కేసులో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఎమ్మెల్యే అనంత్ సింగ్‌కు ప‌దేళ్ల జైలుశిక్ష విధించింది పట్నాలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు. అనంత్​.. బిహార్​లోని మొకామా అసెంబ్లీ స్థానం నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనంత్ సింగ్ ఇంట్లో ఏకే-47 రైఫిల్ కలిగి ఉన్నారన్న కేసులో.. జూన్​ 14న దోషిగా తేల్చిన కోర్టు.. మంగళవారం శిక్షను ఖరారు చేసింది.

2019లోని ఆగస్టు 16న బార్హ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నడ్వా గ్రామంలోని అనంత్ ఇంట్లో అప్పటి ఎస్పీ లిపి సింగ్ నేతృత్వంలోని పట్నా పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు 11 గంటల పాటు సాగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత భారీ మొత్తంలో ఆయుధాలు లభ్యమయ్యాయి. ఏకే 47 రైఫిల్​, లైవ్ క్యాట్రిడ్జ్‌లు, గ్రెనేడ్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అనంత్ సింగ్‌ను అరెస్ట్​ చేశారు.

'ఛోటే సర్కార్'గా ప్రసిద్ధి చెందిన అనంత్ సింగ్.. సీఎం నితీష్ కుమార్‌కు సన్నిహితుడు. 2015లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అనంత్ జేడీయూ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత ఆర్జేడీలో చేరారు. అనంత్ సింగ్ ప్రస్తుతం పట్నాలోని బూర్ జైలులో ఉన్నారు.

ఇదీ చదవండి: 'అందుకే 'అగ్నిపథ్​'.. అందులో ఎలాంటి మార్పులు ఉండవు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.