ETV Bharat / bharat

RBI Jobs 2023 : ఆర్​బీఐలో ఇంజినీర్​​ ఉద్యోగాలకు నోటిఫికేషన్- రూ.71వేలు జీతం!

author img

By

Published : Jun 12, 2023, 1:10 PM IST

RBI Junior engineers Recruitment 2023
RBI Recruitment 2023

RBI Recruitment 2023 : రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా (ఆర్​బీఐ) జూనియర్ ఇంజినీర్​ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా 35 సివిల్, ఎలక్ట్రికల్​ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనుంది. దరఖాస్తుకు ఆఖరి తేదీ 2023 జూన్ 30. పూర్తి వివరాలు మీ కోసం.

RBI Recruitment 2023 : ఇంజినీరింగ్​ చేసిన వారికి గుడ్ న్యూస్​. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా- ఆర్​బీఐ 35 జూనియర్ ఇంజినీర్ (సివిల్​/ ఎలక్ట్రికల్​)​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు రూ.71,032 వరకు నెలవారీ వేతనం ఉంటుంది. బేసిక్ పే మాత్రం రూ.33,900 నుంచి మొదలవుతుంది. ఇతర అలవెన్సులు కూడా అందుతాయి.

వయోపరిమితి?
20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. సంబంధిత కేటగిరీల వారికి రిజర్వేషన్లు వర్తిస్తాయి.

విద్యార్హతలు ఏమిటి?

జూనియర్​ ఇంజినీర్​ (సివిల్​) :

  • ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 3 ఏళ్లు వ్యవధి గల సివిల్​ ఇంజినీరింగ్​ డిప్లొమా చేసి ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, మిగతా కేటగిరీలవారు కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా
  • ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ (దివ్యాంగ) అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో, మిగతా కేటగిరీల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యుండాలి.
  • అనుభవం: డిప్లొమా చేసిన అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల ఎక్స్​పీరియన్స్​, డిగ్రీ చేసిన వారికి కనీసం ఒక సంవత్సరం పూర్వానుభవం ఉండాలి.

జూనియర్​ ఇంజినీర్​ (ఎలక్ట్రికల్​) :

  • ప్రభుత్వం గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 3 ఏళ్లు వ్యవధి ఎలక్ట్రికల్​ లేదా ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్​ ఇంజినీరింగ్​ డిప్లొమా చేసి ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ (దివ్యాంగ) అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో, మిగతా కేటగిరీలవారు కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా
  • ప్రభుత్వం గుర్తించిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్​ లేదా ఎలక్ట్రికల్​ అండ్​ ఎలక్ట్రానిక్​ ఇంజినీరింగ్ డిగ్రీ పొంది ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, పీడబ్ల్యూబీడీ (దివ్యాంగ) అభ్యర్థులు కనీసం 45 శాతం మార్కులతో, మిగతా కేటగిరీల అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యుండాలి.
  • అనుభవం: డిప్లొమా చేసిన అభ్యర్థులకు కనీసం రెండు సంవత్సరాల ఎక్స్​పీరియన్స్​, డిగ్రీ చేసిన వారికి కనీసం ఒక సంవత్సరం పూర్వానుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
అభ్యర్థులకు ముందుగా ఆన్​లైన్​ పరీక్ష నిర్వహిస్తారు. ఇది 300 మార్కులకు ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణత సాధించినవారికి లాంగ్వేజ్​ ప్రొఫీషియన్సీ టెస్ట్​ (LPT) నిర్వహిస్తారు. ఆన్​లైన్ పరీక్ష జులై 15న నిర్వహించనున్నారు.

దరఖాస్తు చేయడం ఎలా?
ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్​లైన్​లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ జూనియర్​ ఇంజినీర్​ పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ 2023 జూన్ 30.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.