ETV Bharat / bharat

కన్హయ్య లాల్ ఇంటికి సీఎం.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ

author img

By

Published : Jun 30, 2022, 3:37 PM IST

Updated : Jun 30, 2022, 4:53 PM IST

Rajasthan CM Ashok Gehlot visits home of tailor murdered in Udaipur
కన్హయ్యలాల్ ఇంటికి సీఎం గహ్లోత్.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ

ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్​ కుటుంబ సభ్యులను పరామర్శించారు రాజస్థాన్ సీఎం అశోక్​ గహ్లోత్. మరోవైపు.. హత్యను నిరసిస్తూ.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఘటనపై ఐక్యరాజ్య సమితి కూడా స్పందించింది.

కన్హయ్యలాల్ ఇంటికి సీఎం గహ్లోత్.. ఉదయ్​పుర్​లో భారీ ర్యాలీ

ఉదయ్‌పుర్‌లో దారుణ హత్యకు గురైన దర్జీ కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్​ గురువారం పరామర్శించారు. హత్యకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం గహ్లోత్​ మీడియాతో మాట్లాడారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఈ కేసు విచారణను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని కోరారు. తీర్పు త్వరగా వెలువడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఉదయ్​పుర్​లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎం పేర్కొన్నారు.
ఉదయ్‌పుర్​లోని ఏడు పోలీస్​స్టేషన్ల పరిధిలో విధించిన కర్ఫ్యూ ఇంకా కొనసాగుతోంది. ఇద్దరు అడిషనల్ డైరెక్టర్ జనరల్, ఒక డిప్యూటీ ఐజీ, ఇతర సీనియర్ అధికారులు నగరంలో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు.

భారీ ర్యాలీ: కన్హయ్య లాల్ హత్యకు నిరసిస్తూ.. ఉదయ్​పుర్​లో 'సర్వ్ హిందూ సమాజ్' ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అనుమతితో ఈ ర్యాలీ నిర్వహించడం వల్ల ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనలేదు. కర్ఫ్యూ ఉన్న ప్రాంతాల్లో.. ఈ ర్యాలీ కోసం ఆంక్షలు సడలించినట్లు అదనపు డీజీ దినేష్‌ ఎంఎన్‌ వెల్లడిచారు.

ఐరాస స్పందన: కన్హయ్య లాల్ హత్యపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. అన్ని మతాలను గౌరవించాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలు సామరస్యంగా మెలగాలన్నారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్. ఈ మేరకు గుటెర్రస్ అధికార ప్రతినిధి స్టీఫెన్ దుజార్రిక్ వెల్లడించారు. ప్రపంచ ప్రజల నుంచి తాము శాంతిని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: 'మహా' సీఎంగా ఫడణవీస్​.. డిప్యూటీ సీఎంగా శిందే.. ముహూర్తం ఫిక్స్!

Last Updated :Jun 30, 2022, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.