ETV Bharat / bharat

Covid-19: 'మోదీ విధానాలతోనే సెకండ్ వేవ్ విజృంభణ'

author img

By

Published : May 28, 2021, 1:32 PM IST

rahul gandi
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​ గాంధీ

దేశంలో కొవిడ్​(Covid-19) రెండో దశ విజృంభణకు ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ. భారత్​లో ప్రస్తుత కరోనా(Covid-19) మరణాల రేటును కేంద్రం దాస్తోందన్నారు. కరోనా పరిస్థితులపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా సందేశం అందించారు.

దేశవ్యాప్తంగా కరోనా(Covid-19) సెకండ్ వేవ్ వ్యాప్తికి ప్రధాని నరేంద్ర మోదీ విధానాలే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. మరణాల రేటును కేంద్రం దాస్తోందని ఆరోపించారు. కరోనా పరిస్థితులపై రాహుల్ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు. కొవిడ్​ విజృంభణ క్రమంలో తాము కేంద్రాన్ని హెచ్చరించినా.. పట్టించుకోలేదన్నారు.

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్​ గాంధీ

లాక్​డౌన్​లు, మాస్కులు ధరించటం తాత్కాలిక పరిష్కారమని.. వ్యాక్సినేషన్​ మాత్రమే కొవిడ్​కు శాశ్వత పరిష్కారమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : cyclone yaas: తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.