ETV Bharat / bharat

'4 నెలలుగా మణిపుర్​ తగలబడుతుంటే.. పార్లమెంట్​లో మోదీ జోకులా?'

author img

By

Published : Aug 11, 2023, 3:42 PM IST

Updated : Aug 11, 2023, 4:03 PM IST

Rahul Gandhi Manipur Violence : నాలుగు నెలలుగా మణిపుర్‌ తగలబడుతుంటే.. పార్లమెంట్​లో ప్రధాని మోదీ జోకులు వేస్తూ నవ్వుతున్నారని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. రెండు గంటలకుపైగా సాగిన మోదీ ప్రసంగంలో.. మణిపుర్‌ గురించి కేవలం రెండే నిమిషాలు మాట్లాడారని విమర్శించారు. మణిపుర్‌ మండిపోతున్న విషయాన్ని ప్రధాని మరచిపోయినట్లున్నారని రాహుల్‌ ఎద్దేవా చేశారు.

Etv Bharat
Etv Bharat

Rahul Gandhi Manipur Violence : ఈశాన్య రాష్ట్రం మణిపుర్​లో జరుగుతున్న హింసను ఆపడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. అల్లర్లు, అత్యాచారాలు, హత్యలతో నాలుగు నెలలుగా మణిపుర్‌ అట్టుడుకుతుంటే.. పార్లమెంట్‌లో ప్రధాని నవ్వుతూ, జోకులు వేశారని రాహుల్‌ గాంధీ దుయ్యబట్టారు. ఈశాన్య రాష్ట్రం ఇంకా తగలబడాలనే ప్రధాని కోరుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Rahul Gandhi Press Meet : లోక్​సభలో మోదీ.. మొత్తం 2 గంటల 13 నిమిషాలు మాట్లాడారని.. అందులో చివరగా రెండు నిమిషాలు మాత్రమే మణిపుర్​ గురించి ప్రస్తావించారని విమర్శించారు. నెలల తరబడి మణిపుర్​ తగలబడుతున్నప్పుడు.. పార్లమెంట్​లో మోదీ జోకులు వేస్తూ నవ్వడం ఆయనకు తగదంటూ రాహుల్​ మండిపడ్డారు. శుక్రవారం దిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన రాహుల్.. మణిపుర్​ మండిపోతున్న విషయం మోదీ మర్చిపోయినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.

  • #WATCH | Congress MP Rahul Gandhi says, "Yesterday the PM spoke in Parliament for about 2 hours 13 minutes. In the end, he spoke on Manipur for 2 minutes. Manipur has been burning for months, people are being killed, rapes are happening but the PM was laughing, cracking jokes. It… pic.twitter.com/WEPYNoGe2X

    — ANI (@ANI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రధాన మంత్రి ఓ రాజకీయ నాయకుడిగా మాట్లాడకూడదు. లోక్​సభలో మోదీ మాట్లాడిన తీరు విచారకరం. ప్రధాని.. రాజకీయ నేత కాదు.. మనందరి ప్రతినిధి. గతంలో ఎందరో ప్రధానులను చూశాను. కానీ ఇలా స్థాయి దిగజారి మాట్లాడిన ప్రధానిని నేను చూడలేదు. అసలు సమస్య గురించి మాట్లాడలేదు. మణిపుర్‌ తగలబడుతోందా? లేదా? అన్నదే ప్రధాన సమస్య."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

Rahul Gandhi On Modi : "మణిపుర్​ సమస్య కాంగ్రెస్​ పార్టీదో లేక నాదో కాదు. అసలు మణిపుర్​లో ఏం జరుగుతోంది?.. అక్కడ అల్లర్లను కేంద్రం ఎందుకు ఆపడం లేదు? మణిపుర్‌లో హిందుస్థాన్‌ను బీజేపీ హత్య చేసింది. మణిపుర్​ హింసను మోదీ ఆపాలనుకోవడం లేదు. అక్కడ భరతమాత హత్య జరిగితే.. ప్రధాని నవ్వుతున్నారు. ఇప్పటికైనా మణిపుర్​కు మోదీ వెళ్లి రెండువర్గాల ప్రతినిధులతో మాట్లాడి హింసను వెంటనే ఆపాలి" అని రాహుల్​ డిమాండ్​ చేశారు.

  • PM at least could go to Manipur, talk to communities and say I am your PM, let's start talking but I don't see any intention...The question is not whether PM Modi will become PM in 2024, the question is Manipur where children, people are being killed, says Congress MP Rahul… pic.twitter.com/0CDHnkiOSj

    — ANI (@ANI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Rahul Gandhi On Manipur Issue : "నేను 19 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. దాదాపు అన్ని రాష్ట్రాలను సందర్శించాను. కానీ మణిపుర్‌లో నేను చూసినవి, విన్నవి బాధాకరం. తొలిసారిగా పార్లమెంట్‌ రికార్డుల నుంచి భరత మాత పదాలను తొలగించడం అవమానకరం. భారత సైన్యం.. కేవలం రెండు రోజుల్లో అల్లర్లు ఆపగలదు. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సమ్మతించడం లేదు" అంటూ రాహుల్​ ఆవేదన వ్యక్తం చేశారు.

  • On Manipur violence, Congress MP Rahul Gandhi says, "Indian Army can stop this drama in 2 days but PM wants to burn Manipur and does not want to extinguish the fire." pic.twitter.com/IkAAG1b1M0

    — ANI (@ANI) August 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రాహుల్‌ గాంధీ కేసులో స్టేకు నిరాకరించిన జడ్జి బదిలీ.. సుప్రీం కొలీజియం సిఫార్స్​

Parliament Sine Die Today : ఆన్​లైన్ గేమింగ్ ట్యాక్స్ బిల్లుకు ఆమోదం.. ఆప్​ ఎంపీపై సస్పెన్షన్ వేటు

Last Updated : Aug 11, 2023, 4:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.