ETV Bharat / bharat

పంజాబ్​లో ఆ రెండు పార్టీలతో భాజపా పొత్తు ఖరారు

author img

By

Published : Dec 27, 2021, 4:12 PM IST

BJP captain alliance
అమిత్​ షా, అమరీందర సింగ్​

BJP captain alliance: పంజాబ్​ శాసనసభ ఎన్నికల్లో అమరీందర్​ సింగ్​, దిండ్సా పార్టీలతో కూటమిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించింది భాజపా. ఉమ్మడి మేనిఫెస్టోను సిద్ధం చేయనున్నట్లు తెలిపింది. అమిత్​ షా, నడ్డాతో కెప్టెన్​, దిండ్సా భేటీ అనంతరం ఈ ప్రకటన చేసింది.

BJP captain alliance: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​, సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సా పార్టీల పొత్తు కొలిక్కి వచ్చింది. పంజాబ్​ లోక్​ కాంగ్రెస్​, శిరోమణి అకాలీదళ్​(సంయుక్త్​)తో కూటమిగా ఎన్నికలకు వెళ్లనున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి, పంజాబ్​ భాజపా ఎన్నికల ఇంఛార్జ్​ గజేంద్ర సింగ్​ షెఖావత్​. ఎన్నికలకు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా నివాసంలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ఆ పార్టీ అగ్రనాయకులతో అమరీందర్​ సింగ్​, సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సా సోమవారం భేటీ అయ్యారు. ఎన్నికల్లో కలిసి పోటీ చేయటం, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

BJP captain alliance
కూటమిపై వివరాలు వెల్లడిస్తున్న కేంద్ర మంత్రి

"దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో అమరీందర్​ సింగ్​, సుఖ్​దేవ్​ సింగ్​ దిండ్సా సమావేశమయ్యారు. పంజాబ్​లో జరగబోయే ఎన్నికల్లో భాజపా, కెప్టెన్​ పార్టీ, దిండ్సా పార్టీ ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించారు. సీట్ల పంపకాల కోసం ప్రతి పార్టీ నుంచి ఇద్దరు నేతలతో ఉమ్మడి​ కమిటీని ఏర్పాటు చేయనున్నాం."

- గజేంద్ర సింగ్​ షెకావత్​, భాజపా పంజాబ్​ ఎన్నికల ఇంఛార్జ్​.

కాంగ్రెస్​, శిరోమణి అకాలీదళ్​, ఆమ్​ ఆద్మీ పార్టీతో పాటు రైతు సంఘాలు సైతం ఎన్నికల్లో పోటీ పడే అవకాశం నేపథ్యంలో పంచముఖ పోరుగా మారనుందని భాజపా వర్గాలు పేర్కొన్నాయి. అమరీందర్​ సింగ్​, దిండ్సా భాజపాతో చేరటం వల్ల రాష్ట్రంలో సిక్కుల మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

ఇదీ చూడండి: అమరీందర్​ సింగ్ కొత్త పార్టీ పేరు ఇదే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.