ETV Bharat / bharat

Punjab Elections 2022: ఎన్నికలు వాయిదా వేయండి.. ఈసీకి సీఎం లేఖ

author img

By

Published : Jan 16, 2022, 8:36 AM IST

Punjab Elections 2022
పంజాబ్ ఎన్నికలు 2022

Punjab Elections 2022: పంజాబ్​లో ఎన్నికలను వాయిదా వేయాలని కోరారు సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ. ఈ మేరకు జనవరి 13న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్‌ చంద్రకు లేఖ రాశారు. గురు రవిదాస్‌ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్‌ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

Punjab Elections 2022: పంజాబ్‌ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నేత చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు జనవరి 13న కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సుశీల్‌ చంద్రకు లేఖ రాశారు. గురు రవిదాస్‌ జయంతి వేడుకల నేపథ్యంలో బెనారస్‌ వెళ్లేందుకు వీలుగా ఎన్నికలు వాయిదా వేయాలంటూ దళిత వర్గానికి చెందిన ప్రతినిధులు తనను కోరిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో ఆ వర్గానికి చెందినవారు దాదాపు 32శాతంగా ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా లేఖలో ప్రస్తావించారు.

Guru Ravidas Jayanti 2022: అలాగే, ఫిబ్రవరి 10 నుంచి 16 వరకు యూపీలోని బెనారస్‌లో జరగనున్న గురు రవిదాస్‌ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు తమ రాష్ట్రం నుంచి దాదాపు 20లక్షల మంది వెళ్లే అవకాశం ఉన్నట్టు సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 14న ఎన్నికలు నిర్వహిస్తే లక్షల మంది తమ రాజ్యాంగపరమైన హక్కుగా ఉన్న ఓటు హక్కును వినియోగించుకోలేరని తెలిపారు. అందువల్ల పోలింగ్‌ తేదీని పొడిగించినట్లయితే బెనారస్‌ వెళ్లి రావడంతో పాటు ఓటు హక్కు వినియోగించుకోగలుగతామని వారు కోరిన విషయాన్ని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ఈ అసెంబ్లీ వారంతా తమ ఓటు హక్కు వినియోగించుకొనేలా కనీసం ఆరు రోజులైనా ఎన్నికలను వాయిదా వేయాలని చన్నీ సీఈసీని కోరారు.

రూ.41.31కోట్ల వస్తువులు స్వాధీనం..

పంజాబ్​లో ఎన్నికల కోడ్​ అమలులోకి వచ్చినప్పటి నుంచి రూ.40.31 కోట్ల విలువైన వస్తువులను సీజ్ చేశారు అధికారులు. రూ.81 లక్షల విలువైన 2.72 లక్షల లీటర్ల మద్యాన్ని నిఘా బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. రూ.38.93 కోట్ల విలువైన సైకోట్రోపిక్ పదార్థాలతో సహా రూ.14 లక్షల నగదును సీజ్ చేశాయని పంజాబ్ ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) ఎస్ కరుణ రాజు వెల్లడించారు. 2022 జనవరి 14 నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

ఇదీ చదవండి: 'బికినీ భామ'కు కాంగ్రెస్​ టికెట్​పై రాజకీయ దుమారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.