ETV Bharat / bharat

సీఎం ప్రకటన- రూ. 590 కోట్ల రుణమాఫీ

author img

By

Published : Jul 14, 2021, 8:05 PM IST

వ్యవసాయ కూలీలు, కౌలుదారులకు రూ. 590 కోట్ల రుణమాఫీ చేయనున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ ప్రకటించారు. రుణమాఫీ పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ. 20,000 వరకు రుణం మాఫీ అవుతుందని పేర్కొన్నారు.

amarinder, punjab cm
అమరీందర్, పంజాబ్ ముఖ్యమంత్రి

రుణ మాఫీ పథకం కింద వ్యవసాయ కూలీలకు, కౌలుదారులకు రూ. 590 కోట్ల లోన్లు మాఫీ చేస్తున్నట్లు పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరిందర్ సింగ్ ప్రకటించారు. 2,85,325 మంది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్) సభ్యులకు ప్రభుత్వం రుణ మాఫీ చేయనుందని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి రూ. 20,000 చొప్పున రుణం మాఫీ అవుతుందని తెలిపారు.

ఆగస్టు 20 నుంచి రుణసాయానికి సంబంధించిన చెక్​లు అందించనున్నట్లు మంగళవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటివరకు ఈ పథకం కింద 5.64 లక్షల రైతులు లబ్ధి పొందారని అన్నారు. మొత్తంగా రూ. 4624 కోట్ల రుణమాఫీ చేసినట్లు పేర్కొన్నారు.

మంగళవారం జరిగిన సమావేశానికి ఆర్థిక మంత్రి మన్​ప్రీత్ సింగ్ బాదల్, కో ఆపరేషన్ మంత్రి సుఖ్​జిందర్ సింగ్ రంధావా, అదనపు ఛీఫ్ సెక్రటరీ(వ్యవసాయ) అనిరుద్ధ్ తివారి హాజరయ్యారు.

ఇదీ చదవండి:'100% వ్యాక్సినేషన్ జరిగిన గ్రామానికి రూ.10లక్షలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.