ETV Bharat / bharat

వెయిట్ లిఫ్టింగ్​లో 49ఏళ్ల పూజారికి గోల్డ్ మెడల్​- 3నెలల క్రితం భుజానికి సర్జరీ అయినా తగ్గేదేలే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 31, 2023, 12:07 PM IST

Priest Won Gold Medal In Strengthlifting
Priest Won Gold Medal In Strengthlifting

Priest Won Gold Medal In Strengthlifting : స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకం సాధించారు ఓ హనుమాన్ ఆలయ పూజారి. భుజానికి ఆపరేషన్​ జరిగినా, డాక్టర్లు బరువులు ఎత్తొద్దని చెప్పినా ప్రాక్టీస్ చేసి మరీ పతకాలను దక్కించుకున్నారు.

Priest Won Gold Medal In Strengthlifting : గుజరాత్​లోని సూరత్​కు చెందిన ఓ హనుమాన్ ఆలయ పూజారి అరుదైన ఘనత సాధించారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకం సాధించారు. 49 ఏళ్ల వయసులోనూ ఆయన పతకాలు సాధించడం వల్ల స్థానికులు, అధికారులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

నగరంలోని రోఖాడియా ప్రాంతంలోని ఉన్న హనుమాన్ ఆలయ పూజారి వందన్ వ్యాస్ చాలా ఏళ్లుగా గుడిలో సేవలు చేస్తున్నారు. రోజూ ఆలయంలో పూజలు పూర్తిచేసుకుని నాలుగు గంటలపాటు వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. స్థానికంగా ఓ జిమ్​లో ప్రదీప్ మోరీ, జితేస్​ జవారేల వద్ద శిక్షణ తీసుకుంటున్నారు.

ఇటీవలే తెలంగాణలోని హైదరాబాద్​లో జరిగిన 10వ ప్రపంచ పవర్ లిఫ్టింగ్ అండ్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నారు. అందులో మాస్టర్-20(76 కిలోలు) విభాగంలో పూజారి వందన్ వ్యాస్ స్ట్రెంగ్త్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం, బెంచ్ ప్రెస్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ఈ ఛాంపియన్‌షిప్‌లో గుజరాత్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సూరత్ నగరం నుంచి మొత్తం 18 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.

గోల్డ్ మెడల్ సాధించిన వందన్ వ్యాస్
గోల్డ్ మెడల్ సాధించిన వందన్ వ్యాస్

డాక్టర్లు వద్దని చెప్పినా!
అయితే ఉదయ్​పుర్​లో కొన్నినెలల క్రితం జరిగిన ఛాంపియన్ షిప్​లో వందన్ వ్యాస్ గాయపడ్డారు. దీంతో ఆయనకు మూడు నెలల క్రితం ఆపరేషన్ జరిగింది. అయితే బరువులు ఎత్తవద్దని డాక్టర్లు చెప్పారు. అయినప్పటికీ వందన్ వ్యాస్ నిరంతర సాధన చేసి ఈ ఘనత సాధించారు. ఈ పతకాలను హనుమంతుడికి అంకితమిస్తున్నట్లు తెలిపారు.

Priest Won Gold Medal In Strengthlifting
వందన్ వ్యాస్

"నేను రోజూ ఉదయం ఆలయంలో హనుమంతుడిని పూజిస్తాను. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటాను. తర్వాత సాయంత్రం జిమ్‌కు వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తాను. డాక్టర్ నన్ను బరువులు ఎత్తవద్దని చెప్పారు. హనుమాన్‌జీ ఆశీస్సులతో నేను బంగారు, కాంస్య పతకాలు సాధించాను. రానున్న రోజుల్లో ఇలాంటి టోర్నమెంట్లలో పాల్గొనబోతున్నాను" అని వందన్ వ్యాస్ తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.