ETV Bharat / bharat

Ayodhya News: 'శ్రీరాముడు లేకుండా అయోధ్య లేదు'

author img

By

Published : Aug 29, 2021, 6:44 PM IST

President visits Ayodhya temple construction site, offers prayers to Ram Lalla
అయోధ్యలో రాష్ట్రపతి

ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్యను(Ayodhya News) సందర్శించారు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​. శ్రీరాముడు, అయోధ్య నగర ప్రాముఖ్యతను కొనియాడారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని పేర్కొన్నారు. గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామాయణ్ ఎన్‌క్లేవ్‌ను ప్రారంభించారు.

శ్రీరాముడు లేకుండా అయోధ్య నగరం(Ayodhya News) లేదని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య అని పేర్కొన్నారు. ఉత్తర్​ప్రదేశ్‌లోని అయోధ్యను సందర్శించిన ఆయన.. శ్రీరాముడు, అయోధ్య నగర ప్రాముఖ్యతను(Ram Mandir Ayodhya) కొనియాడారు. గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సమక్షంలో రామాయణ్ ఎన్‌క్లేవ్‌ను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామాయణ్‌ ఎన్‌క్లేవ్‌ పోస్టల్‌ కవర్‌ను ఆయన ఆవిష్కరించారు.

President visits Ayodhya temple construction site, offers prayers to Ram Lalla
అయోధ్యలో రాష్ట్రపతి
President visits Ayodhya temple construction site, offers prayers to Ram Lalla
అయోధ్యలో రాష్ట్రపతి

రాముడు శాశ్వతంగా అయోధ్యలోనే ఉంటాడన్న కోవింద్‌.. దానికి నిజమైన అర్థం అయోధ్య ప్రాంతం అని తెలిపారు. నిర్మాణంలో ఉన్న రామ్‌జన్మభూమిని(Ram Janmabhoomi) కూడా రాష్ట్రపతి సందర్శించారు. రాముని పట్ల ఉన్న ఇష్టంతోనే తన కుటుంబం తనకు రామ్‌నాథ్‌ అని పేరు పెట్టిందని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరం రామ్‌లల్లా(Ram Lalla), హనుమాన్ గార్హిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేసిన రాష్ట్రపతి.. రామ్‌ జన్మభూమి వద్ద మెుక్కను నాటారు. ఆ తర్వాత అయోధ్య రైల్వేస్టేషన్‌ నుంచి ప్రత్యేక రైలులో తిరుగు పయనమయ్యారు.

President visits Ayodhya temple construction site, offers prayers to Ram Lalla
అయోధ్యలో రాష్ట్రపతి

ఇదీ చూడండి: Minor Vaccine: మైనర్​కు కరోనా టీకా- పరిస్థితి ఆందోళనకరం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.