వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు

author img

By

Published : Aug 16, 2022, 8:51 AM IST

Updated : Aug 16, 2022, 10:12 AM IST

atal bihari vajpayee tribute

దివంగత భాజపా అగ్రనేత, మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, పలువురు ప్రముఖులు మాజీ ప్రధానికి పుష్పాంజలి ఘటించి స్మరించుకున్నారు.

వాజ్​పేయీకి రాష్ట్రపతి, ప్రధాని ఘన నివాళులు

భారత మాజీ ప్రధాని, భాజపా అగ్రనేత దివంగత అటల్​ బిహారీ వాజ్​పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్​ఖడ్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, కేంద్ర హోంమంత్రి అమిత్​ షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు నివాళులు అర్పించారు. దిల్లీలోని వాజ్​పేయీ స్మారకం 'సదైవ్​ అటల్'కు తరలివెళ్లి.. ఆ మహానేత సేవలను స్మరించుకున్నారు. అంతకుముందు వాజ్​పేయీ స్మారకార్థం ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో పాల్గొన్నారు.

atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న ఉపరాష్ట్రపతి జగదీప్​ ధన్​ఖడ్​
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న మోదీ

1990లో భాజపా అధికారంలోకి రావడంలో వాజ్​పేయీ కీలక పాత్ర పోషించారు. వాజ్​పేయీ నేతృత్వంలోని నేషనల్​ డెమోక్రాటిక్​ అలియన్స్​(ఎన్​డీఏ) ప్రభుత్వం 1998-2004 వరకు అధికారంలో ఉంది. భాజపా నుంచి ప్రధాని అయిన తొలి నేతగా గుర్తింపు పొందారు వాజ్​పేయీ. ఆయన మూడు సార్లు ప్రధానిగా సేవలందించారు. 1996లో ప్రధాని అయినప్పటికీ ఆయన ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవలేదు. మళ్లీ 1998,1999లో ప్రధానిగా ఎన్నికయ్యారు. అనారోగ్య కారణాలతో దిల్లీలోని ఎయిమ్స్​లో చికిత్స పొందుతూ 2018, ఆగస్టు 16న 93 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయనకు 2015లో ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం.

atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న అమిత్ షా
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​
atal bihari vajpayee tribute
నివాళులు అర్పిస్తున్న భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

ఇవీ చదవండి: డీఎన్​ఏ పరీక్షలతో నేతాజీ మరణం మిస్టరీని ఛేదించండి

కలెక్టర్ హత్య కేసులో ఆ నేతకు జీవితఖైదు, అయినా ఇంట్లోనే కాలక్షేపం

Last Updated :Aug 16, 2022, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.