విజయానికి 50 వసంతాలు- నేడు బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి

author img

By

Published : Dec 15, 2021, 5:46 AM IST

Updated : Dec 15, 2021, 6:03 AM IST

President kovind bangladesh visit

President kovind bangladesh visit: బంగ్లాదేశ్​ 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ నేడు బంగ్లాదేశ్​కు వెళ్లనున్నారు. మూడు రోజులపాటు ఆ దేశంలో ఆయన పర్యటించనున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత రాష్ట్రపతి చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం.

President kovind bangladesh visit: మూడు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్ నేడు బంగ్లాదేశ్​కు వెళ్లనున్నారు. ఢాకాలో నిర్వహించే 50వ 'విజయ్ దివస్' వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకకు భారత్​ తరఫున గౌరవ అతిథిగా హాజరు కావాల్సిందిగా కోవింద్​ను బంగ్లాదేశ్ అధ్యక్షుడు అబ్దుల్ హమీద్ ఆహ్వానించారు. ఈ మేరకు విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మంగళవారం తెలిపారు.

"బంగ్లాదేశ్​కు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్​ బుధవారం వెళ్లనున్నారు. డిసెంబరు 15 నుంచి 17 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రపతితో పాటు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుభాస్ సర్కార్​, ఎంపీ రాజ్​దీప్ రాయ్​ కూడా వెళ్లనున్నారు."

-హర్షవర్ధన్​ శ్రింగ్లా, విదేశాంగ కార్యదర్శి

Bangladesh vijay diwas: "రామ్​నాథ్​ కోవింద్ బంగ్లాదేశ్ పర్యటన చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. బంగ్లాదేశ్​ స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను 2021లో జరుపుకుంటోంది. ఇది భారత్​, బంగ్లాదేశ్​ల మధ్య 50 ఏళ్ల దౌత్య సంబంధాలకు సాక్ష్యం. 1971 డిసెంబరు 16న పాకిస్థాన్​ సైన్యంపై భారత్, బంగ్లాదేశ్​ బలగాలు సాధించిన విజయానికి గుర్తు" అని శ్రింగ్లా పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత రాష్ట్రపతి చేపట్టనున్న తొలి విదేశీ పర్యటన ఇదేనని.. ఇది భారత్​, బంగ్లా మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రాముఖ్యతను తెలియజేస్తుందని చెప్పారు.

పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ అధ్యక్షుడితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని శ్రింగ్లా తెలిపారు. ఆ దేశ ప్రధాని షేక్ హసీనా, విదేశాంగ మంత్రి ఏకే అబ్దుల్​తోనూ రాష్ట్రపతి భేటీ అవుతారని చెప్పారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు ఏర్పాటు చేసిన విందులో పాల్గొంటారని వెల్లడించారు.

ఇదీ చూడండి: ఐరాసలో వాతావరణ తీర్మానాన్ని వ్యతిరేకించిన భారత్‌

ఇదీ చూడండి: 'పేదరికంలోకి 50 కోట్లకుపైగా ప్రజలు- ఇక సమయం లేదు!'

Last Updated :Dec 15, 2021, 6:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.