ETV Bharat / bharat

హైకోర్టు సీజేనంటూ డీజీపీకి ఫోన్.. తన ఫ్రెండ్​కు క్లీన్ చిట్ ఇవ్వాలంటూ ఒత్తిడి

author img

By

Published : Oct 18, 2022, 11:03 PM IST

ఓ వ్యక్తి తాను పట్నా హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తినంటూ.. బిహార్​ డీజీపీకు పలుమార్లు కాల్స్​, మెసేజ్​లు చేసి ఒత్తిడి తెచ్చాడు. తన ఐపీఎస్​ ఫ్రెండ్​ని ఓ కేసు నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ఆ వ్యక్తి ఈ పని చేశాడని ఆర్థిక నేర విభాగం అధికారులు గుర్తించారు.

Posing as Patna HC chief justice,
పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నంటూ బిహార్​ డీజీపీకు ఫోన్​

పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినంటూ ఓ ఆగంతకుడు బిహార్​ డీజీపీకు ఫోన్​ చేశాడు. లిక్కర్​ మాఫియా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఐపీఎస్ ఆఫీసర్​కు క్లీన్​ చిట్​ ఇవ్వాలంటూ పలుసార్లు ఫోన్​​ చేసి డీజీపీపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో తక్షణమే రంగంలోకి దిగిన అధికారులు అతడిని అరెస్ట్​ చేసి అదుపులోకి తీసుకున్నారు.

అసలేం జరిగిందంటే.. గతంలో ఓ లిక్కర్​ స్కామ్​కు సంబంధించిన కేసులో గయా ప్రాంతానికి చెందిన 2011 బ్యాచ్​ సీనియర్​ ఐపీఎస్​ అధికారి ఎస్​ఎస్​పీ ఆదిత్య కుమార్ నిందితుడిగా ఉన్నారు. అయితే ఆయనపై గతంలో ఓ లిక్కర్​​ స్కామ్​లో భాగంగా ఫతేపూర్​ స్టేషన్​లో పలు సెక్షన్​ల కింద కేసు నమోదైంది. అయితే ఈ కేసులో ఆదిత్యకు క్లీన్ చిట్​ ఇవ్వాలంటూ అభిషేక్​ అనే వ్యక్తి.. బిహార్​ డీజీపీ ఎస్​కే సింఘాల్​కు తాను పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తినంటూ పలుమార్లు కాల్స్​, మెసేజ్​ చేశాడు. వాట్సాప్​ ద్వారా కూడా న్యాయమూర్తి డీపీ పెట్టుకుని ఇలా చేశాడు. దీనిని నమ్మిన డీజీపీ.. ఆదిత్యకు క్లీన్ చిట్​ ఇచ్చారు.

అయితే ఆ రిపోర్టును పరిశీలించిన సీఎంఓ కార్యాలయం.. ఈ కేసులో ఏదో అవకతవకలు జరిగినట్లు భావించి.. కేసును ఈఓయూకు(ఆర్థిక నేరాల విభాగం) అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డీజీపీ ఫోన్​ కాల్​ డేటా ఆధారంగా అభిషేక్​ను పట్టుకున్నారు. అనంతరం ఈ కేసుతో సంబంధం ఉన్న​ మరో ముగ్గిరిని అదుపులోకి తీసుకున్నారు. అభిషేక్​.. డీజీపీపై ఒత్తిడి తీసుకొచ్చిన కారణంగానే ఆదిత్యకు క్లీన్ చిట్​ ఇచ్చినట్లు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ జితేంద్ర సింగ్ గంగ్వార్ వెల్లడించారు. అభిషేక్​ అగర్వాల్​..​ గతంలో చీటింగ్​ సహా రెండు, మూడు కేసుల్లో నేరస్థుడిగా ఉన్నట్లు తెలిపారు. తీహార్​ జైలు​లో శిక్షను కూడా అనుభవించినట్లు పేర్కొన్నారు. నాలుగేళ్ల నుంచి ఆదిత్యకుమార్​.. అభిషేక్​కు పరిచయమున్నట్లు వెల్లడించారు. "అభిషేక్​ అగర్వాల్​, ఆదిత్య కుమార్​లపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశాం. వారితో పాటు గౌరవ్​ రాజ్​, శుభం కుమార్​, రాజుల్​ రంజన్​ అనే ముగ్గురిని కూడా ఈ కేసులో సహ నిందితులుగా చేర్చాం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం" అని డీజీపీ గంగ్వార్​ తెలిపారు. తన ఐపీఎస్​ ఫ్రెండ్​ను లిక్కర్​ కేసు నుంచి బయటకు తీసుకువచ్చేందుకే అభిషేక్​ ఈ పని చేశాడని అధికారులు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.