ETV Bharat / bharat

వనపర్తి నియోజకవర్గంలో హోరాహోరీ- నిరంజన్‌రెడ్డి వర్సెస్‌ మేఘారెడ్డి

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2023, 6:32 AM IST

Wanaparthy Fight
Political Fight in Wanaparthy Constituency

Political Fight in Wanaparthy Constituency : వనపర్తి నియోజకవర్గంలో గెలుపెవరిది? వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డిదా? మంత్రిని ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్‌లో చేరి.. టిక్కెట్టు దక్కకపోయినా.. పట్టుబట్టి బీపాం తెచ్చుకుని బరిలో నిలిచిన మేఘారెడ్డిదా? ఇద్దరిలో ఎవరిది విజయం? విద్యాపర్తిగా పేరుగాంచిన వనపర్తిలో.. విజ్ఞులైన ఓటర్లు ఎవరికి పట్టం కడతారు? నీళ్ల నిరంజన్‌రెడ్డి అభివృద్ధికా? మార్పు కావాలన్న కాంగ్రెస్ పిలుపునకా? ఉమ్మడి పాలమూరు జిల్లాలో హాట్ టాపిక్...వనపర్తి ఎన్నికల ముఖచిత్రంపై కథనం.

వనపర్తి నియోజకవర్గంలో హోరాహోరీ- నిరంజన్‌రెడ్డి వర్సెస్‌ మేఘారెడ్డి

Political Fight in Wanaparthy Constituency : ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యంత ఆసక్తి రేపుతున్న నియోజకవర్గం వనపర్తి. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) అక్కడి నుంచి పోటీ చేస్తుండటం, వాడీవేడి రాజకీయాలకు కేంద్రం బిందువు కావడమే అందుకు కారణం. ఈ ఎన్నికల్లో మంత్రి నిరంజన్ రెడ్డి గెలుస్తారా లేదంటే ఓటమి పాలవుతారా అన్న అంశపై ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చసాగుతోంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు వరకూ ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్న పెద్దమందడి ఎంపీపీ మేఘారెడ్డి.. మంత్రిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాని అధిష్ఠానం చివరి నిమిషంలో చిన్నారెడ్డికి టిక్కెట్టు కేటాయించింది. అయినా పట్టువదలకుండా ప్రయత్నించి చిన్నారెడ్డిని ఒప్పించి.. కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు ఖరారు చేసుకున్నారు మేఘారెడ్డి(Mega Reddy). ఆయనకు అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి వనపర్తిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.

Wanaparthy BRS Candidate Niranjan Reddy: ఐదేళ్లలో వనపర్తిలో సాధించిన ప్రగతే తిరిగి తనకు పట్టం కడుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి ధీమాతో ఉన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం(Kalwakurthy Project), 54 మినిలిఫ్ట్‌ల ద్వారా సాగునీళ్లు అందించి నీళ్ల నిరంజన్‌రెడ్డిగా పేరు తెచ్చుకున్నారు. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న రోడ్ల విస్తరణ పూర్తి చేశారు. వైద్యకళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాలలు తెచ్చారు. ఒకే విడతలో 3 వేల ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేసి.. విద్యుత్ సమస్యను తీర్చారు. గ్రామాలకు రోడ్లు, మంచినీళ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనను పూర్తి చేశారు. ఇవన్నీ ఆయనకు సానుకూల అంశాలు కాగా ఇన్నేళ్లు ఆయన వెంటే ఉన్న మేఘారెడ్డి లాంటి నాయకులు పార్టీని వీడటం ఆయనకు ప్రతికూల అంశం.

"తెలంగాణ జెండా పట్టిన వాడిని నేను. వనపర్తి జిల్లాను ఏర్పాటు చేసినవాడిని నేను. సాగునీళ్లు తెచ్చినవాడిని నేను. కరెంటు, రోడ్లు అన్ని వసతులు కల్పించిన వాడిని నేను. బీఆర్‌ఎస్‌ మాటనే ఒక గ్యారెంటీ. పోలింగ్‌ దగ్గర పడుతుంది లెక్కింపు రోజు ఎవరు ఎవరితో ఉన్నారో మీకే తెలుస్తుంది. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఇంత అభివృద్ధిని నిలబెట్టుకోవడం మన బాధ్యత." - నిరంజన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

ఎర్రబెల్లి వల్లే నేను జైలుకు పోవాల్సి వచ్చింది: రేవంత్ రెడ్డి

Wanaparthy Congress Candidate Mega Reddy : వనపర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఢీ కొట్టగలిగేది కాంగ్రెస్(BRS vs Congress) మాత్రమే. అలాంటి పార్టీలోకి నిరంజన్‌రెడ్డిని ఓడించాలన్న ఏకైక లక్ష్యంతో మేఘారెడ్డి వచ్చారు. మేఘారెడ్డి చేరిక అప్పటి వరకూ నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్‌ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో కాంగ్రెస్‌కు గట్టిపట్టుంది. ఇందుకు ప్రభుత్వం, మంత్రిపై జనాల్లో ఉన్న వ్యతిరేకత తోడైంది. వీటితోపాటు కాంగ్రెస్ గ్యారెంటీలు మేఘారెడ్డి సానుకూల అంశాలు కానున్నాయి. తొలుత చిన్నారెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించి.. ఆ తర్వాత మార్చారు. మేఘారెడ్డికి చిన్నారెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కానీ.. అప్పటి వరకూ కాంగ్రెస్‌లో ఉన్న అన్ని గ్రూపులు మేఘారెడ్డి విజయానికి సహకరిస్తాయా లేదా అన్నదే కీలకం కానుంది.

"సేవ్‌ వనపర్తి.. చేంజ్‌ వనపర్తి.. మన వనపర్తి.. మన పాలన ఇదే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నాము. వనపర్తిని డెవలప్‌మెంట్‌ ముసుగులో ధ్వంసం చేస్తున్నారు. దేవాలయ భూములు, కృష్ణా నది భూములు, మార్కెట్‌ భూములు అన్ని కబ్జాకు గురయ్యాయి. పోయి స్థలాలను వడ్డీతో సహా రికవరీ చేస్తాం." - మేఘారెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి

Telangana Assembly Elections 2023 : వనపర్తి నియోజకవర్గంలో 2.71 లక్షల ఓట్లున్నాయి. వనపర్తికి విద్యాపర్తి అనే పేరుంది. చదువుకున్నవాళ్లు ఎక్కువ. అందుకే విలక్షణ తీర్పులకు వనపర్తి కేంద్రం.1983 నుంచి అక్కడ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలదే అధికారం.1989 నుంచి చిన్నారెడ్డి లేదంటే రావుల చంద్రశేఖర్ రెడ్డికి ఎమ్మెల్యేగా అవకాశం దక్కేది. కాని 2018లో నిరంజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌(టీఆర్‌ఎస్‌) తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీ తరపున బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అనుజ్ఞారెడ్డి సహా 13మంది అభ్యర్ధులు ఈసారి బరిలో ఉన్నారు. బరిలో ఎంతమందున్నా పోరు మాత్రం బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్ మధ్యే కానుంది.

Mahabubnagar Assembly Poll : పాలమూరులో హ్యాట్రిక్ కోసం BRS.. మరో ఛాన్స్ అంటున్న కాంగ్రెస్.. బోణీ కొట్టేందుకు BJP రెడీ

Niranjan Reddy vs Mega Reddy : 1983 నుంచి అయితే చిన్నారెడ్డి లేదంటే రావు చంద్రశేఖర్‌రెడ్డికి వనపర్తి ప్రజలు అవకాశం కల్పించారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరూ బరిలో లేరు. చిన్నారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధికి మద్దతిస్తుండగా.. రావుల ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరి మద్దతు పార్టీలకు లాభిస్తుందా లేదా అన్నది కీలకం కానుంది. నీళ్ల నిరంజన్ రెడ్డి ఐదేళ్ల ప్రగతికి ప్రజలు పట్టం కడతారా? ఆయన్ను ఓడించడమే లక్ష్యంగా వచ్చిన కాంగ్రెస్ అభ్యర్ధి మేఘారెడ్డికి జై కొడతారా.. వేచి చూడాల్సిందే.

CM KCR Speech at Wanaparthy : 'తెలంగాణ కోసం గొంతెత్తింది ఎవరో.. నేతల కాళ్ల దగ్గర కూర్చుంది ఎవరో గుర్తు చేసుకోండి'

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.