ETV Bharat / state

KTR Speech in Wanaparthy Ten Years Progress : 'తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష?'

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 29, 2023, 8:30 PM IST

Updated : Sep 29, 2023, 8:48 PM IST

Wanaparthy District
Etv Bharat

KTR Speech in Wanaparthy Ten Years Progress : అక్టోబర్ 1న పాలమూరు జిల్లాకు రానున్న ప్రధాని మోదీ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని.. కృష్ణాజల్లాలో తెలంగాణ వాటా 575 టీఎంసీలుగా కేటాయించాలని.. మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. రాష్ట్రం పట్ల విషపు మాటలు చిమ్ముతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ నుంచి ఎన్ని దరఖాస్తులు చేసుకున్న దాన్ని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్​ని నమ్మి ఓటేస్తే 24 గంటలు కరెంట్​ పోయి మూడు గంటల విద్యుత్ అని, మంచినీళ్ల కొట్లాటలు.. ఏడాదికో ముఖ్యమంత్రి, కుంభకోణాలు గ్యారెంటీ అని ఎద్దేవా చేశారు. వనపర్తి జిల్లాలో రూ.669 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన కేటీఆర్.. 70 ఏళ్ల పాలకుల తీరు.. పదేళ్ల బీఆర్ఎస్​ అభివృద్ధిని ప్రజలకు వివరించారు.

KTR on Wanaparthy District development తెలంగాణ రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకు అంత కక్షా

KTR Speech in Wanaparthy Ten Years Progress Public Meeting : ఓట్ల వేటకు తెలంగాణ బయలుదేరిన ప్రధాని మోదీ.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తారా? లేదా ప్రజాగ్రహనికి గురవుతారా? తేల్చుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వనపర్తి జిల్లాలో పర్యటించిన ఆయన రూ.669 కోట్ల పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన వనపర్తి (Wanaparthy) పదేళ్ల ప్రగతి మహాసభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

KTR on Wanaparthy District Development : అక్టోబర్ 1న మహబూబ్‌నగర్‌ జిల్లాకు రానున్న ప్రధాని మోదీ (Modi Telangana Tour).. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వాలని కేటీఆర్ (KTR ) డిమాండ్ చేశారు. కర్ణాటకలోని అప్పర్ బద్రాకు జాతీయ హోదా ఇచ్చి.. తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రాష్ట్రం అంటే ప్రధానికి ఎందుకంత కక్ష అని ఎదురుదాడికి దిగారు. తెలంగాణ పట్ల విషపు మాటలు చిమ్ముతున్నారని దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

KTR on PM Modi Telangana Tour : ఈ క్రమంలోనే 811 టీఎంసీల కృష్ణా జలాల్లో (Krishna water)తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటా.. 575 టీఎంసీ నీళ్లు ఇచ్చేందుకు సంతంకం పెట్టడానికి ప్రధాని మోదీకి చెయ్యి రావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. దీనిపై ఇప్పటికైన పాపపరిహారం చేసుకోవాలని అన్నారు. 575 టీఎంసీలు పాలమూరుకు ఇస్తానని.. అక్టోబర్‌ 1న భూత్పూర్‌ జరిగే సభలో ప్రధాని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వాల్మీకి, బోయలకు ఎస్టీ రిజర్వేషన్‌ కల్పించాలని ఎన్ని దరఖాస్తులు పంపిన కేంద్రం పట్టించుకోలేదన్నారు. రెండు సార్లు శాసనసభలో తీర్మానం చేసి పంపినా స్పందిచలేదని కేటీఆర్ ఆక్షేపించారు.

KTR Reaction on TDP Protest in Telangana : ఆంధ్రాలో పంచాయితీ.. ఆంధ్రాలోనే తేల్చుకోవాలి: కేటీఆర్‌

KTR Wanaparthy District Tour : ఓటుతోనే పార్లమెంట్‌లో భయపెట్టి తెలంగాణ సాధించుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు. అదే ఓటుతోనే రాష్ట్రంలో మళ్లీ .. బీఆర్ఎస్ సర్కార్​ను ఏర్పాటు చేసుకుందామన్నారు. దిల్లీలో తెలంగాణ ఎంపీలు లేకుండా ఏ ప్రభుత్వం ఏర్పడలేని పరిస్థితిని కల్పించాలని తెలిపారు. ఆనాడు ఏమి చేయలేని కాంగ్రెస్‌ పార్టీ.. ఇప్పుడు నీతి లేని, రోత పుట్టించే మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వ్యారెంటీ అయిపోయిన పార్టీకి.. గ్యారెంటీలు ఉంటాయా అని కేటీఆర్​ ఎద్దేవా చేశారు.

KTR Fires on Congress 6 Guarantees : ప్రస్తుతం కాంగ్రెస్‌ ఐసీయూలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. పొరపాటున హస్తం పార్టీకి ఓటు వేస్తే, 6 గ్యారెంటీలు (Congress 6 Guarantees) దేవుడెరుగు.. 24 గంటల కరెంట్ పోయి.. 3 గంటల విద్యుత్​ గ్యారెంటీ అని ఆరోపించారు. సంవత్సరానికి ఒక సీఎం మారడం ఖాయమన్నారు. బీఆర్‌ఎస్‌ ఉంటే స్కీములని.. కాంగ్రెస్‌ వస్తే స్కాములు గ్యారెంటీ అన్నారు. 70 ఏళ్లలో కాంగ్రెస్‌ కన్నీళ్లు ఇస్తే.. 9 సంవత్సరాల పాలనలో బీఆర్‌ఎస్‌ సాగునీళ్లు ఇచ్చిందని కేటీఆర్ వెల్లడించారు.

KTR Laid Foundation Eurofins Campus : 'ఉపాధి, ఉద్యోగ కల్పన, సంపదను సృష్టించటమే నేతల ముందున్న సవాల్‌'

KTR Fires on Congress : కాంగ్రెస్‌ అంటే మైగ్రేషన్‌.. బీఆర్‌ఎస్‌ అంటే ఇరిగేషన్‌ అని కేటీఆర్ పేర్కొన్నారు. హస్తం పార్టీ అంటే కరువులు, కన్నీళ్లు అయితే.. భారత్​ రాష్ట్ర సమితి అంటే చెరువులు, నీళ్లు అన్నారు.. పల్లె పల్లెన పల్లెర్లు మొలిచిన పాలమూరు.. నేడు పసిడి పంటలతో పాలు గారే పాలమూరు అయిందని వివరించారు. 71 ఏళ్లలో చేయని అభివృద్ధిని.. వనపర్తిలో సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేసి చూపించారని తెలిపారు. నీళ్లు చెంతనే ఉన్నా.. అప్పుడు వంద ఎకరాలకు నీళ్లురాని కృష్ణానది నుంచి.. ఈరోజు వనపర్తి నియోజకవర్గంలో 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు వస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గులాబీ జెండా ఎగిరేదాకా.. కేసీఆర్‌ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే దాకా.. పాలమూరు గురించి ఎవ్వరు పట్టించుకోలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గతంలో ప్రతి ఏటా 14 లక్షల మంది పాలమూరు బిడ్డలు వలసలు పోతుంటే.. ఏ ముఖ్యమంత్రికైనా గుండే కరిగిందా.. ఏ ప్రధాని అయినా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. 60 ఏళ్ల తెలంగాణ గోసకు ప్రధాన కారణం.. కాంగ్రెస్‌ పార్టీ అని మండిపడ్డారు. 1956లో తెలంగాణ, ఆంధ్రకు ఇష్టం లేని పెళ్లి చేసింది హస్తం పార్టీ అని.. 2004లో మాట ఇచ్చి 2014 వరకు సాగదీసింది నిజం కాదా అని కేటీఆర్ నిలదీశారు.

KTR Laid foundation Stones of Many Bridges : 'హైదరాబాద్​లో తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందే ఉంది'

వనపర్తి జిల్లా కేంద్రంలో రెండు పడక గదుల ఇళ్లను, ప్రొఫెసర్ జయశంకర్ రాక్ గార్డెన్, భూసార పరీక్షల ప్రయోగశాలను కేటీఆర్ ప్రారంభించారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, ఐటీ హబ్​కు శంకుస్థాపన చేశారు. వనపర్తి మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, డ్రైన్స్​తో పాటు రహదారులు, బైపాస్‌ నిర్మాణానికి, బాలుర, బాలికల జేఎన్‌టీయూ హాస్టల్ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి ఎంపీలు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, రాములుతో పాటు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్దన్‌రెడ్డిలు పాల్గొన్నారు.

"వనపర్తి జిల్లాలో 71 ఏళ్లలో జరగని పనులు ఇక్కడి మంత్రి చేసి చూపారు. సిరిసిల్ల, సిద్దిపేట అభివృద్ధితో అన్ని జిల్లాలు పోటీపడాలి. వచ్చే ఎన్నికల్లో సిరిసిల్ల, సిద్దిపేట కంటే అధిక మెజార్టీతో గెలిపించాలి. ఏ పదవి ఆశించకుండా ఉద్యమం వేళ నిరంజన్‌రెడ్డి పనిచేశారు. వనపర్తిని జిల్లా చేసిన ఘనత కేసీఆర్‌ది." - కేటీఆర్, ఐటీ, పురపాలకశాఖ మంత్రి

Minister KTR Fires on Governor Tamilisai : 'గవర్నర్‌ మనసుతో ఆలోచించి ఉంటే.. తిరస్కరించేవారు కాదు'

KTR Laid foundation Stones of Many Bridges : 'హైదరాబాద్​లో తొమ్మిదిన్నర ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి కళ్ల ముందే ఉంది'

Last Updated :Sep 29, 2023, 8:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.