ETV Bharat / bharat

Anuradha Murder Case : అనురాధ హత్య కేసు..పోలీసుల రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు..!

author img

By

Published : May 26, 2023, 9:10 PM IST

Anuradha Murder Case
Anuradha Murder Case

Police Remand Report in Anuradha Murder Case : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన అనురాధ హత్య కేసు.. రిమాండ్‌ రిపోర్ట్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనురాధను చంపేస్తే.. ఆమెకు ఇవ్వాల్సిన డబ్బులు, నగలు ఇవ్వక్కర్లేదని నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిపారు. మరోవైపు మృతదేహాన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి ముక్కలు చేసినట్లు పోలీసులు వివరించారు.

Anuradha Murder Case Update : మలక్‌పేట పోలీస్‌సేష్టన్ పరిధిలో దారుణ హత్యకు గురైన అనురాధ కేసును.. రాచకొండ పోలీసులకు బదిలీ చేశారు. నిందితుడి రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు కీలకమైన విషయాలను చేర్చారు. చంద్రమోహన్‌, అనురాధ 15 ఏళ్లుగా సహజీవనం చేశారని దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఇద్దరికి కొన్ని సంవత్సరాల నుంచి విభేదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విభేదాల కారణంగా మృతురాలు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుందని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అనురాధ పెళ్లి కోసం మాట్రిమోనీలో ప్రకటనలు ఇచ్చిందని పోలీసులు తెలిపారు. తాను వివాహం చేసుకుంటానని..తన డబ్బు, నగలు తిరిగివ్వాలని చంద్రమోహన్‌ను డిమాండ్ చేసింది. తనకు రావలసిన రూ.17 లక్షల నగదుతోపాటు 2 కిలోలకు పైగా బంగారం ఇవ్వాలని కోరింది. దీంతో నిందితుడు ఆమెను చంపేస్తే డబ్బులు, నగలు ఇవ్వాల్సిన అవసరం ఉండదనే కారణంతో.. హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Anuradha Murder Case : ఈ క్రమంలోనే అనురాధతో గొడవపడిన చంద్రమోహన్‌.. ఆమెను కత్తితో 15పోట్లు పొడిచి దారుణంగా హత్యచేశాడని పోలీసులు తెలిపారు. తర్వాత మృతదేహాన్ని ఇంట్లోనే భద్రపరిచాడని వివరించారు. మృతురాలి గది పక్కన మరో కుటుంబ అద్దెకు ఉండేదని.. వారు ఊరికి వెళ్లాక మరుసటిరోజు స్టోన్‌ కట్టర్ తెచ్చి అనురాధ మృతదేహాన్ని నిందితుడు ముక్కలుగా చేశాడని వివరించారు. వాటిని ప్లాసిక్‌ కవర్లో ప్యాక్ చేసి ఫ్రిజ్‌లో పెట్టి ఐదు రోజుల పాటు ఉంచాడని పోలీసులు తెలిపారు.

A Nurse Murder Case in Hyderabad : నిందితుడు తర్వాత అనురాధ తలను తీసుకెళ్లి మూసీలో పడేశాడని పోలీసులు పేర్కొన్నారు. సామాజికమాధ్యమాల్లో చూసి మృతదేహాన్ని ముక్కలు చేశాడని తెలిపారు. చంద్రమోహన్.. అనురాధ మృతదేహం దుర్వాసన రాకుండా వివిధ రకాల రసాయనాలను వాడినట్లు వెల్లడించారు. మృతురాలికి.. కూతురితోపాటు, బంధువులెవరితోనూ సంబంధాలు లేవని.. ఆమెను చంపితే ఎవ్వరూ రారని పక్క ప్రణాళికతో హత్య చేశాడని పోలీసులు చెప్పారు.

అనురాధ చార్‌ధామ్‌ యాత్రకు వెళ్తున్నట్లు సృష్టించాడని.. ఇదే విషయాన్ని స్ధానికులకు చంద్రమోహన్‌ చెప్పాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే అనుమానం రాకుండా.. మృతురాలి కూతురుతో చాటింగ్‌ చేసినట్లు వివరించారు. మరోవైపు ఆమె సెల్‌ఫోన్‌ను చార్‌ధామ్‌కు తీసుకెళ్లి ధ్వంసం చేయాలని ప్రణాళికను సిద్దం చేసుకోన్నాడని.. కానీ అప్పుడే అతడిని అరెస్ట్ చేశామని రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు వెల్లడించారు.

అసలేం జరిగిదంటే : హైదరాబాద్‌లో ఈ నెల 17న మలక్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మూసీనది సమీపంలో మొండెం లేని మహిళ తల లభ్యమైంది. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాల ద్వారా తలను అక్కడ పడేసిన వ్యక్తిని చంద్రమోహన్‌గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి.విచారించగా.. తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు.

ఇవీ చదవండి: a Bodyless Head Case Malakpet : అప్పు తీర్చమన్నందుకు ఆయువు తీశాడు

'సర్​ప్రైజ్ ఇస్తా.. కళ్లు మూసుకో' అని కత్తితో పొడిచి హత్య.. శవాన్ని ముక్కలు చేసి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.