ETV Bharat / bharat

'గురు గోవింద్​ సింగ్​ జీవితం.. మానవాళికి స్ఫూర్తిదాయకం'

author img

By

Published : Jan 20, 2021, 11:46 AM IST

Guru Gobind Singh birth anniversary
'గురు గోవింద్​ సింగ్​ జీవితం.. మానవాళికి స్పూర్తిదాయకం'

10వ సిక్కుమత గురువు గురు గోవింద్​ సింగ్​ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఆయనను స్మరించుకున్నారు. ఆయన జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ అన్నారు.

సిక్కుల మత గురువు గురు గోవింద్‌ సింగ్‌ జయంతి(ప్రకాష్​ పూరవ్​) సందర్భంగా.. రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి బుధవారం నివాళులర్పించారు. గురు గోవింద్‌ సింగ్‌ జీవితం.. మానవాళికి స్ఫూర్తిదాయకమని రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కొవింద్‌ పేర్కొన్నారు. సమానత్వం, సమగ్రతను ఆయన జీవితం ప్రతిబింబిస్తుందన్నారు.

  • My humble tributes on the auspicious occasion of Guru Gobind Singh ji's Parkash Purab. His life has been inspiring for humanity, propagating equality & inclusiveness. He was not just a spiritual ideal but a warrior who stood by principles even in the face of supreme sacrifice.

    — President of India (@rashtrapatibhvn) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

10వ సిక్కు గురువు గోవింద్‌ సింగ్‌ జీవితం సంఘటిత సమాజాన్ని సృష్టించడానికి తోడ్పడిందని ప్రధాని మోదీ కొనియాడారు. సమగ్ర సమాజాన్ని సృష్టించడానికి ఆయన అంకితభావంతో కృషి చేశారని మోదీ ట్వీట్‌ చేశారు.

  • The Guru Sahibs have a special Kripa on me that the 350th Parkash Purab of Sri Guru Gobind Singh Ji took place during the tenure of our Government. I recall the grand celebrations in Patna, where I also had the opportunity to go and pay my respects. pic.twitter.com/BNElOBj8hk

    — Narendra Modi (@narendramodi) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గురుగోవింద్​ సింగ్​ జయంతిని పురస్కరించుకుని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. గురు బోధనలు సార్వజనీనమైనవని అన్నారు. ధైర్యం, కరుణ, సమాజసేవకు గురూజీ మారుపేరు అని పేర్కొన్నారు.

  • My heartiest greetings on the occasion of Guru Gobind Singh Jayanti today. Guru Ji's name epitomises courage, compassion and service of society. His teachings are eternally relevant and will continue to inspire generations to come. #GuruGobindSingh

    — Vice President of India (@VPSecretariat) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సింగ్​ జయంతి సందర్భంగా భక్తులు ఉదయాన్నే అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలన్ని దర్శించుకున్నారు. రైతు చట్టాల రద్దుకు ఆందోళన చేస్తున్న రైతులు సింఘు సరిహద్దుల్లోనే సిక్కు గురువుకు నివాళులు అర్పించారు.

ఇదీ చూడండి:ప్రముఖ మతబోధకుడి ఇంట్లో ఐటీ సోదాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.