ETV Bharat / bharat

'ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే లక్ష్యం'

author img

By

Published : Nov 22, 2020, 1:00 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్​, సోన్​భద్ర జిల్లాల్లో రెండు తాగునీటి సరఫరా ప్రాజెక్టులను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు యూపీలోని కొన్ని ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

PM Narendra Modi
'ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే మా లక్ష్యం'

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఉత్తర్​ప్రదేశ్​లోని పలు ప్రాంతాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వివిధ వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్యలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఉత్తర్​ప్రదేశ్​లోని మీర్జాపుర్, సోన్​భద్ర జిల్లాల్లో రూ. 5,555 కోట్ల విలువైన గ్రామీణ తాగునీటి సరఫరా ప్రాజెక్టులను మోదీ వర్చువల్​గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై పరోక్ష విమర్శలు చేశారు.

"ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వింద్యాంచల్​, బుందేల్​ఖండ్​ ఇలా ఎన్నో ప్రాంతాలు కరవును చూశాయి. చాలా నదులు ఉన్నప్పటికీ ఎన్నో ప్రాంతాలు దాహార్తితో అలమటించాయి. ఎంతో మంది వలసలు వెళ్లే పరిస్థితి వచ్చింది.

'హర్​ ఘర్​ జల్'​ పథకం ప్రారంభించి ఏడాది గడిచింది. 2.6 కోట్ల కుటుంబాలు.. ఇంటికి కుళాయిల ద్వారా తాగు నీరు పొందుతున్నాయి. ఇప్పుడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్​ శరవేగంగా పూర్తవుతుంది. ప్రతి ఇంటికి తాగు నీరు అందించడమే మా లక్ష్యం."

- ప్రధాని నరేంద్ర మోదీ

ఈ ప్రాజెక్ట్​ ద్వారా రెండు జిల్లాల్లోని 2,995 గ్రామాలకు తాగునీరు అందనుందని అధికారులు తెలిపారు. ఫలితంగా సుమారు 42 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.