'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకకు మోదీ.. భాజపా సీఎంలకు ఆహ్వానం

author img

By

Published : Dec 7, 2021, 6:34 AM IST

Updated : Dec 7, 2021, 6:48 AM IST

pm modi visit to varanasi

Pm Modi Varanasi Visit: వారణాసిలో 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకను డిసెంబర్ 13, 14న భాజపా ఘనంగా నిర్వహించనుంది. ఈ వేడుకకు 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ప్రధాని ఆహ్వానించారు.

pm modi varanasi visit: కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 13, 14న 'దివ్య కాశీ భవ్య కాశీ' వేడుకను భాజపా ఘనంగా నిర్వహించనుంది. డిసెంబర్ 13న వారణాసిలో జరగనున్న ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా 12 భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను ప్రధాని ఆహ్వానించారు.

డిసెంబర్ 14న 'సుపరిపాలన' అంశంపై ప్రధానమంత్రి సెమినార్ నిర్వహిస్తారు. అన్ని రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలతో ముచ్చటించనున్నారు. ప్రధానమంత్రి వారణాసిలోని యోగా కేంద్రమైన స్వర్వేద్ మహామందిర్ ధామ్‌ని సందర్శించనున్నారని సమాచారం.

ఇదీ చదవండి:రైల్వేస్టేషన్​ను తలపించిన ఎయిర్​పోర్ట్​- కేంద్రమంత్రి చర్యలు

Last Updated :Dec 7, 2021, 6:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.