ETV Bharat / bharat

'జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం అదే'

author img

By

Published : Nov 28, 2021, 8:14 AM IST

2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌ అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మిషన్‌ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని ట్విట్టర్​ వేదికగా వివరించారు.

PM Modi news
ప్రధాని నరేంద్ర మోదీ

గ్రామీణ భారతంలోని 2024 నాటికి ప్రతి ఇంటికి కుళాయి ద్వారా తాగునీరు అందించేందుకు ప్రారంభించిన జల్‌ జీవన్‌ మిషన్‌(Jal Jeevan Mission PM Modi) అసలు ఉద్దేశం సాకారం అవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.

లద్దాఖ్‌కు చెందిన ఓ మహిళ ఈ పథకం ద్వారా జీవితం ఎంత సాఫీగా మారిందో వివరించగా ఆ వీడియోను కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ వీడియోను మోదీ తన ట్విట్టర్‌ ఖాతాలో ట్యాగ్‌ చేశారు. జల్‌జీవన్‌ మిషన్‌ అసలు లక్ష్యం ఇదే అని ప్రధాని వివరించారు.

  • जल जीवन मिशन का असली उद्देश्य भी तो यही है। जिस संकल्प के साथ इस अभियान को शुरू किया गया था, वो साकार हो रहा है। https://t.co/WOrOVeSnPq

    — Narendra Modi (@narendramodi) November 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మరో ట్వీట్‌లో జపనీస్​ భాషాను నేర్చుకుంటున్నందుకు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను మోదీ ప్రశంసించారు. ఆయన కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇష్టపడే వ్యక్తి అని, జపనీస్​ నేర్చుకోవాలనే నిర్ణయం దిశగా మరో ముందడుగు వేశారని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: mohan bhagwat news: 'దేశ విభజనకు ముఖ్య కారణం అదే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.