ETV Bharat / bharat

'గ్లోబల్ గవర్నెన్స్ విఫలం.. జీ20 వైపే ప్రపంచ దేశాల చూపు'

author img

By

Published : Mar 2, 2023, 12:26 PM IST

ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి అన్ని దేశాలు మందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచదేశాల మధ్య సంబంధాలు తెగిపోతున్న సమయంలో ఈ సదస్సు జరుగుతున్నందున.. అన్ని దేశాలు ఈ జీ20 సదస్సు వైపే చూస్తున్నాయని మోదీ అన్నారు.

g20 foreign ministers meeting
g20 foreign ministers meeting

ప్రపంచ విచ్ఛిన్నం అవుతున్న సమయంలో ఈ జీ20 సదస్సు జరుగున్నందున అన్ని దేశాల చూపు దీనిపైనే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనడానికి అన్ని దేశాలు మందుకు రావాలని మోదీ పిలుపునిచ్చారు. 'ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు' అనే నినాదంతో.. వసుధైక కుటుంబం అనే భావనతో జీ20 విదేశాంగ మంత్రుల సదస్సు భారత్​లో ప్రారంభమైంది. మార్చి 1 నుంచి 4 వరకు జరుగుతున్న ఈ జీ20 సమావేశానికి హరియాణాలోని గురుగ్రామ్​ వేదికైంది.

ఈ సదస్సులో వీడియో కాన్ఫెరెన్స్​ ద్వారా పాల్గొన్న మోదీ.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంపై అన్ని దేశాలు ఏకాభిప్రాయంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. విభజించే వాటిపై కాకుండా.. అందరినీ కలిపే అంశాలపై దృష్టి కేంద్రీకరించాలని మోదీ కోరారు. ఈ విషయంలో గాంధీ, బుద్ధుడు జన్నించిన ఈ భారతదేశ నాగరికత నుంచి ప్రేరణ పొందాలని ప్రతినిధులకు మోదీ పిలుపునిచ్చారు. ఇటీవల ఎదురైన పలు సమస్యలపై స్పందించిన తీరు.. ప్రపంచ స్థాయి సంస్థల వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు.

"ప్రపంచ దేశాలు విచ్ఛిన్నం అవుతున్న సమయంలో మనందరం కలుసుకున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాల వంటి వాటిని ఎదుర్కొనడంలో ప్రపంచ స్థాయి సంస్థలు విఫలమయ్యాయి. వివిధ దేశాల మధ్య ఏర్పడ్డ వివాదాలు, ఉద్రిక్తతలు ఎలా పరిష్కరించాలనే అనే దానిపై మనందరి ఆలోచనలు ఉన్నాయి. మనం కలిసి పరిష్కరించుకోలేని సమస్యలను మనం చేయగలిగిన వాటి దారిలోకి రానివ్వకూడదు. వృద్ధి, అభివృద్ధి, విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యం, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాతీయ నేరాలు, అవినీతి వంటి సవాళ్లను తగ్గించడానికి ప్రపంచం ఇప్పుడు జీ20 దేశాల వైపు చూస్తోంది. ఈ అన్ని రంగాల్లో ఏకాభిప్రాయాన్ని పెంపొందిచడానికి, కచ్చితమైన ఫలితాలు సాధించగలిగే సామర్థ్యం జీ20కు ఉంది. ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న దేశాలు, ఈ గదిలో లేని వారి పట్ల మాకు కూడా బాధ్యత ఉంది."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాని

మరోవైపు, ఐరాస వంటి బహుళపక్ష సంస్థల తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. ప్రస్తుత కాలానికి తగినట్లు ఇవి ఉండటం లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే ఆ సంస్థలపై విశ్వసనీయత మరింత సన్నగిల్లుతుందని వ్యాఖ్యానించారు.

g20 foreign ministers meeting
విదేశాంగ మంత్రి జైశంకర్​

"ప్రస్తుత ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా యూఎన్​ఓ ప్రమాణాలు లేవు. ఇవి 8 దశాబ్దాల నాటివి. అప్పటికీ ఇప్పటికీ దీనిలో సభ్యదేశాల సంఖ్య 4 రెట్లు పెరిగింది. ఇవి ప్రస్తుత రాజకీయ, ఆర్థిక, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేవు. 2005 నుంచి వీటిలో మార్పులు తీసుకురావాలని అధిక దేశాలు కోరుతున్నాయి. కానీ మనందరికీ తెలిసినట్లుగా.. ఇవి కార్యరూపం దాల్చలేదు. దీనికి సంబంధించిన కారణాలు కూడా అందరికీ తెలుసు. మనం దానిని కోరకలను వాయిదా వేస్తున్నంత కాలం.. దీనిపై ఉన్న విశ్వసనీయత మరింత తగ్గుతుంది. దీనికి భవిష్యత్​ ఉండాలంటే.. ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి."
-జైశంకర్​, భారత విదేశాంగ మంత్రి

ప్రస్తుతం జీ20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. మార్చి 1 నుంచి 4న వరుకు గురుగ్రామ్​లో జరగుతున్న విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనడానికి.. సభ్యదేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రతినిధులు భారత్​కు చేరుకున్నారు. వారందరికీ భారత్ విదేంశాంగ మంత్రి జైశంకర్ మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఆయన ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు.

g20 foreign ministers meeting
జీ20 సదస్సుకు హాజరైన సభ్య దేశాల ప్రతినిధులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.