ETV Bharat / bharat

బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు బయల్దేరిన మోదీ.. ఆ నేతలతో మాత్రమే చర్చలు!

author img

By

Published : Aug 22, 2023, 8:30 AM IST

Updated : Aug 22, 2023, 9:10 AM IST

PM Modi BRICS summit South Africa
PM Modi BRICS summit South Africa

PM Modi BRICS summit South Africa : దక్షిణాఫ్రికా పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశానికి బయల్దేరారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనడం సహా వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో ఆయన భాగమవుతారు.

PM Modi BRICS summit South Africa : బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరిన ఆయన.. దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్​బర్గ్​కు చేరుకోనున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షతన 15వ బ్రిక్స్ దేశాల సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోసా ఆహ్వానం మేరకు ఆగస్టు 22-24 తేదీల్లో దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు మోదీ.

  • #WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Johannesburg, South Africa.

    He is visiting South Africa from 22-24 August at the invitation of President Cyril Ramaphosa to attend the 15th BRICS Summit being held in Johannesburg under the South African Chairmanship. pic.twitter.com/hRy220autL

    — ANI (@ANI) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బ్రిక్స్ సదస్సుతో పాటు.. బ్రిక్స్-ఆఫ్రికా అవుట్​రీచ్ కార్యక్రమంలో తాను పాల్గొంటానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు పర్యటనకు బయల్దేరే ముందు ట్వీట్ చేసిన మోదీ.. గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చిస్తామని చెప్పారు. వైవిధ్యమైన రంగాల్లో సంబంధాల బలోపేతానికి బ్రిక్స్ కృషి చేస్తోందని పేర్కొన్నారు మోదీ. సదస్సుకు హాజరయ్యే నేతల్లోని 'కొంతమంది'తో తాను సమావేశమవుతానని వెల్లడించారు.

  • Leaving for South Africa to take part in the BRICS Summit being held in Johannesburg. I will also take part in the BRICS-Africa Outreach and BRICS Plus Dialogue events. The Summit will give the platform to discuss issues of concern for the Global South and other areas of…

    — Narendra Modi (@narendramodi) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"వివిధ రంగాల్లో సహకారం బలోపేతం అయ్యేందుకు అజెండా రూపకల్పనలో బ్రిక్స్ తోడ్పడుతోంది. గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలపై చర్చించేందుకు బ్రిక్స్ ఉత్తమ వేదికగా నిలుస్తోంది. జొహన్నెస్​బర్గ్​లో నేను బ్రిక్స్ సదస్సుతో పాటు బ్రిక్స్ ఆఫ్రికా అవుట్​రీచ్ కార్యక్రమంలో పాల్గొంటా. బ్రిక్స్ ప్లస్ చర్చల్లో భాగమవుతా. బ్రిక్స్ సదస్సుకు ఆహ్వానం పొందిన అతిథులతో సంభాషించేందుకు ఎదురుచూస్తున్నా. జొహన్నెస్​బర్గ్​కు వచ్చే దేశాధినేతల్లోని కొందరితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తిగా ఉన్నా."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

మరోవైపు, చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ జొహన్నెస్​బర్గ్​కు చేరుకున్నారు. దక్షిణాఫ్రికా కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం ఆయన జొహన్నెస్​బర్గ్​లో దిగారు. జిన్​పింగ్​కు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా స్వాగతం పలికారు.
కాగా, ఈ బ్రిక్స్ సమావేశాల్లో జిన్​పింగ్, మోదీ ద్వైపాక్షిక భేటీ ఉంటుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. భారత విదేశాంగ శాఖ సైతం దీనిపై నేరుగా సమాధానం ఇవ్వలేదు. ప్రధాని ద్వైపాక్షిక భేటీలు ఇంకా ఖరారు కాలేదని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 2020లో వాస్తవాధీన రేఖ వెంబడి జరిగిన ఘర్షణల తర్వాత మోదీ, జిన్​పింగ్ సమావేశం కాలేదు. గతేడాది ఇండోనేసియాలో జీ20 సమావేశాల సందర్భంగా ఇరువురూ కాసేపు ముచ్చటించారు. ఈ నేపథ్యంలో అధికారిక భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

PM Modi South Africa Visit : బ్రిక్స్​ సమ్మిట్​కు ప్రధాని మోదీ.. జిన్​పింగ్​తో భేటీ అవుతారా?

''బ్రిక్స్‌ సహకారం'తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం'

Last Updated :Aug 22, 2023, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.