ETV Bharat / bharat

'దేశంలోనే అత్యుత్తమ యాత్రాస్థలంగా పండర్​పుర్!'

author img

By

Published : Nov 8, 2021, 5:25 PM IST

PM lays foundation stone of road projects in temple town Pandharpur
దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన యాత్రాస్థలంగా తీర్చిదిద్దుతామని

మహారాష్ట్ర పండర్​పుర్​లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ పుణ్యక్షేత్రానికి అనుసంధానిస్తూ రెండు రోడ్డు ప్రాజెక్టులను వర్చువల్​గా ప్రారంభించారు. పండర్​పుర్​ను దేశంలోనే స్వచ్ఛమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని అక్కడి ప్రజలకు పిలుపునిచ్చారు.

మహారాష్ట్రలో ప్రముఖ పుణ్యక్షేత్రం పండర్​పుర్​లో రెండు రోడ్డు ప్రాజెక్టుల పనులకు వర్చువల్​గా శంకుస్థాపన చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శ్రీ సంత్ జ్ఞానేశ్వర్ మహారాజ్ పల్లకీ మార్గ్ (NH-965), శ్రీ సంత్ తుకారాం మహారాజ్ పల్లకీ మార్గ్​లో(NH-965G) నాలుగు లైన్ల రహదారి పనులను ప్రారంభించారు. ఈ రహదారులకు ఇరువైపులా భక్తులు నడిచేందుకు కాలినడక మార్గాన్ని కూడా నిర్మించనున్నారు.

పండర్​పుర్​ను దేశంలోనే స్వచ్ఛమైన పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని ప్రజలు తనకు మాటివ్వాలని మోదీ కోరారు. పల్లకీ మార్గ్ దారిలో చెట్లు నాటి, భక్తులకు తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయాలని సూచించారు. పండర్​పుర్​ ఆనందం, శ్రేయస్సుకు ప్రతీక అని, ఈ ప్రాంతానికి అనుసంధానిస్తూ 225కి.మీ జాతీయ రహదారి నిర్మాణాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సహాయ మంత్రి వీకే సింగ్, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు.

భారత్​మాల పరియోజన ద్వారా వైష్ణో దేవి, గోల్డెన్ టెంపుల్, రిషికేశ్, హరిద్వార్, చార్ ధామ్ వంటి అన్ని తీర్థయాత్ర ప్రదేశాల్లో రూ.12,070 కోట్లు వెచ్చింది 673కి.మీ మేర రహదారులు నిర్మించినట్లు గడ్కరీ వివరించారు. సుప్రీంకోర్టు అనుమతి తర్వాత మరో 827కి.మీ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు.

ఇదీ చూడండి: 'హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో లఖింపుర్ కేసు విచారణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.