ETV Bharat / bharat

ఇస్రో 'పీఎస్​ఎల్​వీ' విజయంపై మోదీ ప్రశంసలు

author img

By

Published : Nov 7, 2020, 8:22 PM IST

PM congratulates ISRO for successful launch of PSLV-C49/EOS-01 Mission
ఇస్రో సక్సెస్​కు ప్రధాని మోదీ ప్రశంసలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. పీఎస్​ఎల్​వీ సీ-49 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. కరోనా కాలంలో అన్ని అడ్డంకులను ఎదుర్కొని విజయం సాధించారని అన్నారు.

పీఎస్​ఎల్​వీ సీ-49 ప్రయోగం విజయవంతమైన సందర్భంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)ను అభినందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కరోనా కాలంలో అనేక అడ్డంకులను జయించి.. అనుకున్న సమయానికి ప్రయోగాన్ని చేపట్టారని శాస్త్రవేత్తలను కొనియాడారు.

  • I congratulate @ISRO and India's space industry for the successful launch of PSLV-C49/EOS-01 Mission today. In the time of COVID-19, our scientists overcame many constraints to meet the deadline.

    — Narendra Modi (@narendramodi) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పీఎస్​ఎల్​వీ-సీ49/ఈఓఎస్​-01 మిషన్​ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో, అంతరిక్ష పరిశ్రమకు నా అభినందనలు. నిర్దేశిత సమయానికి లక్ష్యాన్ని చేరుకునేందుకు మన శాస్త్రవేత్తలు ఎన్నో అడ్డంకులను అధిగమించారు."

-- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

శనివారం మధ్యాహ్నం 3 గంటల 12 నిమిషాలకు పీఎస్​ఎల్​వీ రాకెట్​ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నింగిలోకి పంపించింది ఇస్రో. మొత్తం 10 ఉపగ్రహాలను(1 స్వదేశీ, 9 విదేశీ) నిర్దేశిత కక్ష్యలలో ప్రవేశపెట్టింది. ఇందులోని దేశీయ భూపరిశీలన ఉపగ్రహం(ఈఏఎస్​-01) ద్వారా వాతావరణ, వ్యవసాయ, అటవీ సంబంధ సమాచారం తెలుసుకోవచ్చు.

కేంద్ర హోంమంత్రి అమిత్​ షా కూడా ఇస్రోకు అభినందనలు తెలిపారు. ఇస్రో నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. దేశ శాస్త్రవేత్తలను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.

  • Congratulations to @ISRO on the successful launch of #PSLVC49 carrying EOS-01 and 9 international satellites from US, Luxembourg and Lithuania.

    This remarkable feat reflects the commitment and consistency of Team ISRO.

    India is proud of our scientists! pic.twitter.com/xx4EL0RXcq

    — Amit Shah (@AmitShah) November 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

'మరిన్ని ప్రయోగాలు...'

చిన్న ఉపగ్రహ వాహననౌకల ప్రయోగాలతో పాటు మరిన్ని మిషన్​లకు ఇస్రో సన్నద్ధమవుతున్నట్టు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఛైర్మన్​ కే.శివన్​ వెల్లడించారు. పీఎస్​ఎల్​వీ-సీ49 ప్రయోగం విజయవంతమైన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే పీఎస్​ఎల్​వీ-సీ50ని ప్రయోగించనున్నట్టు స్పష్టం చేశారు​. సీఎమ్​ఎస్​01 ఉపగ్రహాన్ని దీని ద్వారా నింగిలోకి పంపనున్నట్టు శివన్​ తెలిపారు.

ఇదీ చూడండి:- భూతవైద్యం పేరుతో అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.