ETV Bharat / bharat

పినరయి విజయన్​ అనే నేను..

author img

By

Published : May 20, 2021, 3:43 PM IST

Updated : May 20, 2021, 4:28 PM IST

ఎన్నో సవాళ్లను అధిగమించి ప్రజా పరీక్షలో విజయం సాధించిన పినరయి విజయన్​.. కేరళ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో జయకేతనం ఎగరేసి రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించి..​ వరుసగా రెండోసారి సీఎం పీఠాన్ని అధిరోహించారు. మరో దఫా తనదైన మార్క్​ పాలనను అందించేందుకు సిద్ధమయ్యారు.

pinarayi-vijayan-sworn-in-as-cm
పినరయి విజయన్​ అనే నేను..

దేశ రాజకీయాల్లో కేరళది ప్రత్యేక స్థానం. ఇక్కడ ఎంత భారీ స్థాయిలో అభివృద్ధి జరిగినా.. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అధికార మార్పిడికే ఓటు వేస్తారు కేరళవాసులు. ఎన్నోమార్లు ఈ విషయం రుజువైంది కూడా. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తిరుగు లేని విజయాన్ని అందుకుని.. తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారు రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​. ఎన్నో సవాళ్లు.. మరెన్నో ఆరోపణలను ఎదుర్కొని.. ముందుకు సాగి విజయ తీరాలకు చేరిన విజయన్​.. గురువారం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

విజయన్​ పూర్తి పేరు పినరయి విజయన్​. ఆయన పుట్టింది.. 1945 మే 24న నాటి మద్రాసు ప్రావిన్సులోని మలబార్​ జిల్లాలో. విజయన్ తల్లిదండ్రులు కోరన్​, కల్యాణి. గవర్నమెంట్​ బ్రెన్నెన్​ కాలేజీలో బీఏ ఎకనామిక్స్​ పూర్తి చేసిన ఆయనకు ఇద్దరు సంతానం. భార్య కమల.. విజయన్​ వెన్నంటే ఉంటారు.బ్రెన్నెన్​ కళాశాల నుంచే విజయన్​ రాజకీయ ప్రస్థానం మొదలైంది. నాటి విద్యార్థి సంఘాల్లో ఆయన చురుకుగా ఉండేవారు. అనంతరం సీపీఎం​లో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

2021 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం విజయన్​కు కూడా ఎంతో ప్రత్యేకం! అటు నిపా.. ఇటు కరోనా.. ఓవైపు గోల్డ్​ స్కాం, మరోవైపు శబరిమల... ఇలా ఎన్నో సవాళ్లను విజయన్​ ఎదుర్కొన్నారు. వాటన్నింటికి ఎదురీది.. ప్రజల నుంచి క్లీన్​ చిట్ పొందారు. ప్రజా పరీక్షలో విజయం సాధించి మళ్లీ సీఎం కుర్చీని అధిరోహించారు.

Last Updated : May 20, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.