ETV Bharat / bharat

యమునా నదిలో విషపు నురగలు- అందులోనే పుణ్యస్నానాలు

author img

By

Published : Nov 8, 2021, 1:22 PM IST

Updated : Nov 8, 2021, 7:12 PM IST

'ఛఠ్​ పూజ' వేడుకలు(Chhath Puja 2021) సోమవారం ఉత్తరాది రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే.. దిల్లీలోని యుమునా నదిలో(Yamuna River Pollution) విషపు నురగలు ప్రవహిస్తుండడం.. అక్కడి ప్రజలకు ఇబ్బందిగా మారింది. కలుషిత నీటిలోనే పుణ్య స్నానాలు ఆచరిస్తూ భక్తులు వేడుకల్లో పాల్గొంటున్నారు.

toxic foam in yamuna river
'ఛఠ్​ పూజ' వేడుకలు

యమునా నదిలో విషపు నురగలు- అందులోనే పుణ్యస్నానాలు

పుణ్యనదుల్లో ఒకటైన యమునా నదీ జలాలు ప్రస్తుతం కాలుష్యమయంగా(Yamuna River Pollution) మారాయి. పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండగా.. విషపు నురగలు తేలియాడుతున్నాయి. అయినా.. దానిలోనే భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం ఉత్తరాది రాష్ట్రాల్లో 'ఛఠ్​ పూజ' వేడుకలు(Chhath Puja 2021) ప్రారభమయ్యాయి. ఇందులో భాగంగా నదుల్లో పుణ్యస్నానాలు ఆచరించి, సూర్య భగవానుడిని ప్రత్యేక పూజలు చేస్తారు. దిల్లీలోని కాలింద్​ కుంజ్ వద్ద యమునా నది ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు ప్రవహిస్తున్నాయి. కానీ, అదే విషపు నీటిలోనే(Yamuna River Pollution) పుణ్య స్నానాలు చేస్తున్నారు భక్తులు.

toxic foam in yamuna river
విషపు నురగల మధ్య భక్తుల పుణ్య స్నానాలు

"ఛఠ్​ పూజ(Chhath Puja 2021) వేడుకల్లో నదిలో స్నానం చేయడం అత్యంత ప్రధానమైనది. నేను ఇక్కడికి పుణ్యస్నానం చేసేందుకు వచ్చాను. కానీ, నీళ్లు మాత్రం మురికిగా ఉన్నాయి. ఈ నీటిలోకి దిగితే చాలా సమస్యలు, వ్యాధులు వస్తాయి. కానీ, మేం ఏమీ చేయలేం. బిహార్​లో ఘాట్​లు శుభ్రంగా ఉంటాయి. కానీ, ఇక్కడ అస్సలు బాగోలేవు. దిల్లీ ప్రభుత్వం వెంటనే ఘాట్​లను శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకోవాలి" అని కల్పన అనే ఓ భక్తురాలు అసహనం వ్యక్తం చేసింది.

chhat puja in delhi
యమునా నది కాలుష్యం మధ్య ఛఠ్​ పూజ వేడుకలు

బిహార్​, ఝార్ఖండ్​, ఉత్తర్​ప్రదేశ్​ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో ఏటా వైభవంగా 'ఛఠ్​ పూజ' ఉత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో నాలుగు రోజుల పాటు ఈ ఛఠ్​ పూజలు చేస్తారు. ఈసారి నవంబర్ 8న 'నాహాయ్ ఖాయ్'తో ప్రారంభమైన ఈ వేడుకలు నవంబరు 11న ముగియనున్నాయి.

toxic foam in yamuna river
విషపు నీటిలో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు
toxic foam in yamuna river
యమునా నదిలో తేలియాడుతున్న విషపు నురగలు

ఇదీ చూడండి: యమునా నదిలో 'అమోనియా'- దిల్లీకి నీటి సరఫరా బంద్!

Last Updated :Nov 8, 2021, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.