ETV Bharat / bharat

ఎల్​జేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా పశుపతి!

author img

By

Published : Jun 17, 2021, 6:25 PM IST

Updated : Jun 17, 2021, 10:45 PM IST

ఎల్​జేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా పశుపతి కుమార్​ పరాస్​ను ఎన్నుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయనకు పోటీగా మరెవరు నామినేషన్​ పత్రాలు దాఖలు చేయని నేపథ్యంలో పశుపతిని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నాయి. అయితే ఈ ఎన్నికల పార్టీ నిబంధనలకు విరుద్ధమని చిరాగ్​ పాసవాన్​ పేర్కొన్నారు.

Pashupati Kumar Paras
పశుపతి కుమార్​ పరాస్​

లోక్​జనశక్తి పార్టీ(ఎల్​జేపీ)లో రాజకీయాలు రోజుకో రూపు సంతరించుకుంటున్నాయి. ఎల్​జేపీలో తిరుగుబావుట ఎగురవేసిన ఎంపీ పశుపతి కుమార్​ పరాస్​ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎవరు నామినేషన్ పత్రాలను దాఖలు చేయలేదని.. ఈనేపథ్యంలో పరాస్​ను అధికారికంగా ఎన్నుకున్నట్లు పేర్కొన్నాయి. అలాగే పార్టీ అధ్యక్షుడి హాదాలో రాష్ట్ర సీఎం నితీశ్​ కుమార్​తో పరాస్​ మాట్లాడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీంతో ఎల్​జేపీ నేత చిరాగ్​ పాసవాన్​ను మరో షాక్​ తగిలినట్లు అయింది.

పార్టీ నిబంధనలకు విరుద్ధం

అయితే పార్టీ కార్యనిర్వాహక సభ్యులు కూడా హాజరుకాకుండా జరిగిన ఈ ఎన్నికలు పార్టీ నిబంధనలకు విరుద్ధమన్నారు ఎల్​జేపీ నేత చిరాగ్ పాసవాన్​. పార్టీలో 90 మందికిపైగా కార్యనిర్వహక సభ్యులు ఉండగా.. పట్నాలో జరిగిన పార్టీ అధ్యక్ష ఎన్నికకు 9 మంది మాత్రమే హాజరయ్యారని.. దీనిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. తన పార్టీ ఎన్నికల గుర్తు, జెండాను పశుపతి ఉపయోగించకుండా ఆపమని ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు చిరాగ్​ తెలిపారు.

పార్టీలో చీలిక వచ్చిన నేపథ్యంలో తనను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి నియమించేందుకు దిల్లీలో ఆదివారం కార్యనిర్వహక సమావేశం నిర్వహించనున్నట్లు ఎల్​జేపీ సెక్రటరీ జనరల్ అబ్దుల్ ఖలిక్ తెలిపారు.

ఇదీ చూడండి: కార్లలో తప్పనిసరిగా ఇవి ఉండాల్సిందే..

Last Updated :Jun 17, 2021, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.