భారీగా గుప్త విరాళాలు, ప్రాంతీయ పార్టీల్లో వైకాపాకే అధికం

author img

By

Published : Aug 26, 2022, 10:17 PM IST

Updated : Aug 26, 2022, 10:49 PM IST

Party Fund in India:

Party Funds in India పార్టీలకు ఇచ్చే ఎన్నికల విరాళాలకు సంబంధించిన కీలక నివేదికను బయటపెట్టింది అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌. గత ఆర్థిక సంవత్సరంలో జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కలిపి రూ.690.67 కోట్ల విరాళాలు అందినట్లు నివెేదికలో తెలిపింది.

Party Funds in India: ఎన్నికల విరాళాలకు సంబంధించి కీలక నివేదికను అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్​) బయటపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2004-05 నుంచి 2020-21 మధ్య జాతీయ పార్టీలకు రూ.15,077 కోట్ల గుప్త విరాళాల (గుర్తు తెలియని మూలాల నుంచి) రూపంలో అందినట్లు తన నివేదికలో పేర్కొంది. ఒక్క 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే జాతీయ, ప్రాంతీయ పార్టీలకు రూ.690.67 కోట్లు ఈ రూపంలో విరాళంగా అందినట్లు తెలిపింది. మొత్తం 8 జాతీయ పార్టీలు, 27 ప్రాంతీయ పార్టీలను ఏడీఆర్‌ పరిగణనలోకి తీసుకుంది. 2004-05, 2020-21 మధ్య కాలంలో ఆయా పార్టీలు ఎన్నికల సంఘం వద్ద సమర్పించిన ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ రిటర్నులు, డొనేషన్‌కు సంబంధించిన వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించినట్లు ఏడీఆర్‌ తెలిపింది.

  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ 8 జాతీయ పార్టీలు తమకు గుర్తు తెలియని మూలల నుంచి రూ.426.74 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. 27 ప్రాంతీయ పార్టీల నుంచి రూ.263.92 కోట్లు వచ్చినట్లు పేర్కొన్నాయని తెలిపింది.
  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 178.782 కోట్లు గుప్త విరాళాలు వచ్చినట్లు కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. జాతీయ పార్టీలకొచ్చిన ఇటువంటి విరాళాల్లో ఈ వాటా 41.89 శాతం కావడం గమనార్హం.
  • ఇదే కాలానికి గుర్తు తెలియని మూలాల నుంచి రూ.100.502 కోట్లు విరాళంగా వచ్చినట్లు భాజపా పేర్కొన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది.
  • ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే.. ఇదే ఆర్థిక సంవత్సరంలో ఐదు పార్టీలు అత్యధికంగా ఈ తరహా నిధులు అందుకున్నాయి. ఇందులో వైకాపా రూ.96.25 కోట్లతో అగ్రస్థానంలో ఉంది. డీఎంకే రూ.80.02 కోట్లు, బీజేడీ రూ.67 కోట్లు, ఎంఎన్‌ఎస్‌ రూ.5.77 కోట్లు, ఆప్‌ రూ.5.4 కోట్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.
  • జాతీయ, ప్రాంతీయ పార్టీలకొచ్చిన మొత్తం రూ.690.67 కోట్ల నిధుల్లో 47.06 శాతం ఎలక్టోరల్‌ బాండ్ల నుంచి వచ్చినట్లు ఏడీఆర్‌ తెలిపింది.

జాతీయ పార్టీలు (8): భాజపా, కాంగ్రెస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, బీఎస్పీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్​పీఈపీ)
ప్రాంతీయ పార్టీలు (27): ఆప్‌, ఏజీపీ, ఏఐఐఏడీఎంకే, ఏఐఎఫ్‌బీ, ఏఐఎంఐఎం, ఏఐయూడీఎఫ్‌, బీజేడీ, సీపీఐ (ఎంఎల్‌) (ఎల్‌), డీఎండీకే, డీఎంకే, జీఎఫ్‌పీ, జేడీఎస్‌, జేడీయూ, జేఎంఎం, కేసీ-ఎం, ఎంఎన్‌ఎస్‌, ఎన్‌డీపీపీ, ఎన్‌పీఎఫ్‌, పీఎంకే, ఆర్‌ఎల్‌డీ, ఎస్‌ఏడీ, ఎస్‌డీఎఫ్‌, శివసేన, ఎస్‌కేఎం, తెదేపా, తెరాస, వైకాపా

ఇవీ చదవండి: భార్యపై ప్రేమతో ఇంట్లోనే మృతదేహాన్ని పూడ్చిన భర్త, కానీ చివరకు

న్యాయమూర్తి ప్రధాన లక్ష్యం అదే కావాలన్న జస్టిస్ రమణ

Last Updated :Aug 26, 2022, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.